జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభ విజయవంతం చేసినందుకు జనసేన అధినేత పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక నోట్ రాసుకొచ్చారు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడంలో ఎంతోమంది కష్టపడ్డారు, సభ ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.
ఈ వేడుకను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకునేలా అన్ని విధాలుగా సహకరించిన పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ క్రమంలో ఐపీఎస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారికి క్షేత్ర స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో పాల్గొన్న కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ సభకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పార్టీ తరపున ఈ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసి జయకేతనం సభ విజయవంతం చేసిన మంత్రివర్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత పిడుగు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ ఉదయ్ గారికి, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
కార్యమ్రమం ఏర్పాట్లను.. సభాస్థలం ఎంపిక నుంచి సభ పూర్తయ్యే వరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రా మ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ రావు గారికి, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య బృంధాలు సిద్ధం చేసిన డాక్టర్ సెల్ బృందానికి, సభా ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా, సభ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు డాక్యుమెంటరీగా వివరిస్తూ ప్రజలకు తెలిసేలా చేస్తున్న జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులకు వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసిన జనసేన సాంస్కృతిక విభాగం కమిటీకి, శ్రీ హరీష్ పాయి గారికి, కళాకారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.
సభ విజయవంతం అవ్వడానికి పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, మంత్రి శ్రీ @naralokesh గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, గౌ|| రాజమహేంద్రవరం పార్లమెంట్… pic.twitter.com/hjQ7y03SQa
— Pawan Kalyan (@PawanKalyan) March 19, 2025
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క @JanaSenaParty నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12 వ ఆవిర్భావ… pic.twitter.com/1ujCm1GjgT
— Pawan Kalyan (@PawanKalyan) March 19, 2025