Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు హీరోతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, మంత్రి. ఓపక్క కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.. మరోవైపు మంత్రిగా తీరికలేని షెడ్యూల్స్ తో బిజీ. హరిహర వీరమల్లు, ఓజీ పూర్తి చేయాల్సి ఉంది. ఈక్రమంలో కొత్త సినిమాలేవీ ఒప్పుకునే పరిస్థితులు లేవని చెప్పొచ్చు. అయితే.. ఓ కథకు ఆయన గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా చేస్తారు. అయితే ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. గతంలోనే ఒకే అయిన సినిమా. పవన్ కు సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చింది. కిక్, రేసుగుర్రం వంటి మాస్ సినిమా. పవన్ కు నచ్చి ఏం మార్చొద్దు.. అలానే వెళ్దామన్నారు. అసలు కిక్ కూడా పవన్ చేయాల్సిన సినిమానే. పవన్ కోసమే కథ రాసుకున్నారు. కానీ.. కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా తెరకెక్కిస్తా’మని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.