జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ.. ఎప్పుడో తెలుసా ?

జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ.. ఎప్పుడో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత అయన వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు .. ఇప్పటికే పవన్ వరుసగా నాలుగు సినిమాలు క్యూ లో పెట్టడం విశేషం. పింక్ సినిమాతో పాటు క్రిష్ సినిమా, తరువాత మైత్రి మూవీస్ తో హరీష్ శంకర్ సినిమా, ఆ తరువాత మరో సినిమా. ఇలా పవన్ వరుస సినిమాలు క్యూ లో పెట్టడం ఇండస్ట్రీ వర్గాలకు ఆసక్తి రేకెత్తించింది.

అయితే పవన్ ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా సిద్ధంగా ఉంది .. అదేమిటంటే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడూ జూనియర్ పవర్ స్టార్ అఖీరా నందన్ ఎంట్రీ? ఎస్ .. ఇప్పటికే అఖీరా ఎంట్రీ పై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా తన వారసుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధం అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అఖీరా పూణే లో తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఉంటున్నాడు. త్వరలోనే వారిని హైద్రాబాద్ కు షిఫ్ట్ చేసేందుకు పవన్ సన్నాహాలు చేస్తున్నాడట.

అంతా బాగానే ఉంది కానీ అఖీరా ను హీరోగా పరిచయం చేసేది ఎవరు ? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న? తాజా సమాచారం ప్రకారం అఖీరా బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడట ? కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే అఖీరా ను హీరోగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడట ? సో దీనికి సంబందించిన అధికారిక వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.