Switch to English

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

91,243FansLike
57,268FollowersFollow

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు. కనీసం, డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తూర్పు కాపు సామాజిక వర్గ ప్రముఖులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలపై జనసేన అధినేతకు వినతి పత్రం అందించారు. రిజర్వేషన్లు సహా పలు అంశాల గురించి ఈ సందర్భంగా జనసేన అధినేతతో మాట్లాడారు.

‘జనసేన పార్టీ మీకు అండగా వుంటుంది. కానీ, మీరు పోరాటానికి ముందుకు రావాలి. భయపడితే ఏమీ చేయలేం. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప. మీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుల్ని మీరే ముందు పెట్టండి.. అప్పుడు వ్యవస్థలో మార్పులొస్తాయ్. 2024 తర్వాత ఇలాంటి సమావేశాలు జరగకూడదు.. ఎవర్నీ దేహీ అని అడిగే పరిస్థితి రాకూడదు..’ అని జనసేనాని స్పష్టం చేశారు.

‘జనసేన పార్టీకి అండగా నిలబడండి. తూర్పు కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఒకవేళ చూపించని పక్షంలో, నా కాలర్ పట్టుకుని నిలదీసే హక్కుని మీకు ఇప్పుడే ఇక్కడే ఇస్తున్నాను..’ అని జనసేన అధినేత ఒకింత ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

టీడీపీ హయాంలో ఒక లెక్క.. వైసీపీ హయాంలో ఒక లెక్క తూర్పు కాపు సామాజిక వర్గ జనాభా గురించి వినిపిస్తోందనీ, అంటే ఎక్కడో తేడా జరుగుతోందని జనసేనాని అనుమానం వ్యక్తం చేశారు. ‘కుల భావన ప్రతి ఒక్కరికీ వుండాలి. దానర్థం, ఇతరుల్ని కించపర్చడం కాదు. మన కులానికి మనం మేలు చేసుకోవాలి..’ అనే భావన అన్ని కులాల్లో వుండాలి.. అన్ని కులాలూ కలిసి అభివృద్ధి చెందాలనే గొప్ప ఆలోచన కూడా వుండాలని జనసేనాని చెప్పుకొచ్చారు.

‘ఉత్తరాంధ్రలో ఉద్దానం సమస్యపై గతంలోనే నేను స్పందించాను.. నేను చెయ్యగలిగింది చేశాను, చేస్తూనే వుంటాను. బహుశా ఆ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు.. ఎందుకంటే ఆయన అజ్ఞానంలో వుంటారు.. ఆనక తెలిసీ తెలియని మాటలేవో మాట్లాడతారు..’ అంటూ ఎద్దేవా చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

‘నాటు.. నాటు ఆస్కార్ గెలవాలి..’ జనసేనాని ఆకాంక్ష.. అభినందనలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు.. నాటు పాట ఎంపికైనందుకు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

కృష్ణగారు హంట్ చూసి మెచ్చుకుంటారు అనుకున్నా – సుధీర్ బాబు

నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’.. సినీ ప్రముఖుల అభినందన

భారతీయ సినీ ప్రేమికుల ఆశలకు అనుగుణంగా 95వ ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ది...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ...

రాజకీయం

‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?

‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...

తెలంగాణలో పర్యటిస్తా.. ఈసారి వదలను.. పొత్తుకు ఎవరొచ్చినా ఓకే: పవన్

‘తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ, 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయని స్థానాల్లో జనసేన సత్తా చాటాలి. మన భావజాలానికి...

అదిగదిగో జనసేనాని ‘వారాహి’.! ఏపీలో ఆపేదెవరు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

‘అమ్మో’రికా.! జర జాగ్రత్త కుర్రాళ్ళూ.!

అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి...

ఎక్కువ చదివినవి

ఈ సంక్రాంతికి కలెక్షన్ల దుమ్ము దులిపిన తెలుగు, తమిళ చిత్రాలు

సంక్రాంతి అంటేనే చిత్రాల పండగ. ఈ సంక్రాంతికి రెండు భారీ తెలుగు చిత్రాలు, రెండు భారీ తమిళ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు భారీ సినిమాలు సాధించిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? అక్షరాలా...

హీరోయిన్ తో విద్యార్ధి అనుచిత ప్రవర్తన..! ఆగ్రహం వ్యక్తం చేసిన నటి

అభిమాన సినీ హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగడం సాధారణ విషయమే. అయితే.. మితిమీరిన ఉత్సాహం ఒకోసారి వారిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ప్రస్తుతం మళయాళ హీరోయిన్ అపర్ణా బాలమురళీకి ఇలానే ఓ చేదు అనుభవం...

రంగమార్తాండ సెకండ్ సింగిల్ “నన్ను నన్నుగా” విడుదల..

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మె గా స్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ...

‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?

‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...

అరవ హీరోను నమ్ముకుని నిండా మునిగిన రాజుగారు..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు తమిళ తంబీలు పట్టం కడుతున్నారు. అయితే...