“నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్‌లే”: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీని క్రమశిక్షణ కలిగిన సిద్ధాంత సమూహంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జనసేన సమావేశాల్లో కనిపించిన హడావుడి, యువత ఉత్సాహం ఇప్పుడు క్రమశిక్షణగా మారిందని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న యువత ఇప్పుడు దేశానికి వెన్నెముకలా నిలిచే సిద్ధాంత బలంగా తయారవుతోందని చెప్పారు.

నా సంపద సాధక్‌లే.. జనసేనను సిద్ధాంత బలంగా తీర్చిదిద్దుతున్నాం: పవన్ కళ్యాణ్

రాజమహేంద్రవరంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సాధక్‌లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సగటు మనిషి ఆవేదన నుంచి పుట్టిందని పేర్కొన్నారు. 20 వేల మంది సాధక్‌లు, 21 లక్షల మంది ఉద్యమీల శక్తితో పార్టీ ముందుకు సాగుతోందన్నారు. తన జీవిత అనుభవాలు, సమాజంలో మార్పు కోసం కలిగిన ఆవేదనే ఉద్యమానికి కారణమైందని చెప్పారు. “నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్‌లే” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

పార్టీ కోసం మొదటి నుంచి నిలబడ్డ జనసైనికులు, వీరమహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం, భావజాలం చిరస్థాయిగా నిలవాలని తన ఆకాంక్ష అని తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లతో పాటు ప్రత్యేక బృందాలు పని చేస్తాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు తమ సేవలను దరఖాస్తుల రూపంలో కమిటీలకు అందించాలని సూచించారు.

నా సంపద సాధక్‌లే.. జనసేనను సిద్ధాంత బలంగా తీర్చిదిద్దుతున్నాం: పవన్ కళ్యాణ్

ఇకపై పార్టీపై, తనపై ఇష్టానుసారం విమర్శలు చేసే వారిపై గట్టిగా స్పందిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా తేనెతుట్టెలా సమిష్టిగా ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు. ఆధారాలతో, విజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించని ప్రసార మాధ్యమాలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యం వంటి కీలక సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కాపు నాయకుల పేరుతో తనపై జరుగుతున్న విమర్శలపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడూ కుల రాజకీయాల కోసం పార్టీ పెట్టలేదని, దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తనతో నడిచిన వారు ఏ కులానికి చెందిన వారైనా వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. జనసైనికులు, వీరమహిళలు కులాల చట్రంలో ఇరుక్కుపోవద్దని సూచించారు.

“నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్‌లే”: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలంగా నిలవాలని, పార్టీ నిర్మాణ ప్రక్రియలో సాధక్‌లు కీలక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రతి సాధక్, ఉద్యమితో ప్రత్యక్ష కమ్యూనికేషన్ కొనసాగిస్తానని తెలిపారు.

 

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ఎక్కువ చదివినవి

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

కోదాడలో గ్యాస్ పేలుడు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం గ్యాస్ పేలుడు సంభవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగా థియేటర్ సమీపంలోని సందులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు...

శ్రీసిటీలో లోకేష్ కీలక ప్రకటనలు.. ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి...