విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. ఆ ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్ర అభివృద్ధి దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని అన్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం అనే నాలుగు అంశాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సుమారు రూ.9.74 లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంట్రాక్టర్లు, వెండర్లకు చెల్లించకుండా వదిలేసిన బకాయిలే రూ.1.35 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించామని చెప్పారు. వివిధ శాఖల అభివృద్ధి పనుల కోసం మరో రూ.37 వేల కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం వల్ల డిస్కంలకు రూ.12,250 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయని, ఆ భారం ప్రజలపై విద్యుత్ బిల్లుల రూపంలో పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేసి, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. పీఎంఏవై అర్బన్, ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ వంటి పథకాల కింద రావాల్సిన రూ.10,500 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించలేదని చెప్పారు. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్‌కు పునరుత్తేజం ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు వేల గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి రూ.4,610 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.11,506 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అదే విధంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంలో కూడా గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.

విద్యాశాఖలో కూడా పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టుల మౌలిక వసతులను మెరుగుపరచడం అవసరమని అన్నారు. కొత్త కోర్టు భవనాల నిర్మాణంతో పాటు డిజిటల్ మౌలిక వసతులు, వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే విచారణ వేగవంతం అవుతుందని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహ రాశికి గుర్తింపు సూచనలు.. మీన రాశికి ఆర్థిక ఉపశమనం కనిపించే రోజు

ఏప్రిల్ 9 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి పనుల్లో ఊపొస్తే, మరికొన్ని రాశుల వారు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రయాణాలు,...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

“‘The Paradise’లో విలన్‌గా మోహన్ బాబు… రూ.7 కోట్ల పారితోషికం హాట్ టాపిక్!”

టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీస్తున్న అప్డేట్ ఇది. హీరో నాని నటిస్తున్న ‘The Paradise’ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన విలన్‌గా నటిస్తున్న విషయం  తెలిసిందే.  అయితే ఇప్పుడు  మరింత...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...