తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష నిర్వహించారు. బాలిక ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం కొనసాగుతున్న శోధన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులో పాల్గొంటున్నప్పటికీ, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.

దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు మరింత విస్తృతంగా నిర్వహించాలని, అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్‌తో పాటు నిపుణుల సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆయన తెలిపారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం పరిసరాల్లోని అడవులను పూర్తిస్థాయిలో జల్లెడ పట్టాలని సూచించారు.

దర్యాప్తు పురోగతిపై వివరించిన కాకినాడ ఎస్పీ, ప్రస్తుతం 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అత్యాధునిక డ్రోన్ల సాయంతో విస్తృతంగా శోధన కొనసాగుతోందని, చిన్నారి ఇంటి పరిసరాల్లో ఉన్న 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించినట్లు వెల్లడించారు.

వారం రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి బాలికను క్షేమంగా గుర్తించేందుకు చర్యలు మరింత ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఎక్కువ చదివినవి

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

పులుల కోసం పవన్ కీలక భేటీ.. ఏపీకి రెండు ఆడ పులులు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ముంబైలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పరస్పర...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

సూర్య-జ్ఞానవేల్ మూవీ.. హోంబలే నుంచి మరో భారీ ప్రకటన

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. హీరో సూర్య, 'జై భీమ్' దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని...

తెలుగు సినిమాకు కావాల్సింది రికవరీ మోడల్ కాదు.. నమ్మకం గెలిచే బిజినెస్ మోడల్

ఒకప్పుడు సినిమా పూర్తయిన తర్వాత నిర్మాతలు, దర్శకులు, అభిమానులు ఎదురుచూసేది ఒక్కటే... "సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?" అనే ప్రశ్న. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి...