Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. సుదీర్ఘ కాలం షూటింగ్ తర్వాత ఎట్టకేలకు జూన్ 12న సినిమా విడుదలవుతోందని ప్రకటించింది టీమ్. అయితే.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సినిమా మరోసారి జూన్ 12న విడుదలువుతోంది. అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి రూ.11కోట్లు తిరిగి నిర్మాతకి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. 2020లో ప్రారంభమైన సినిమా సుదీర్ఘ కాలం సెట్స్ పైనే ఉండిపోయింది. పవన్ రాజకీయంగా బిజీ కావడం.. ఎన్నికల్లో గెలిచి ఉపముఖ్యమంత్రి కూడా కావడంతో మరింత బిజీగా మారిపోయారు.
కొంత భాగం సినిమాను క్రిష్ తెరకెక్కించిన తర్వాత జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో సినిమా నిర్మాణంపై అదనపు భారం పడినట్టైంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో దయాకర్ రావు సినిమా నిర్మించారు.
