చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎంతో శుభకరమే కాకుండా అనుకున్న పనులు జరుగుతాయని భక్తుల నమ్మకం. అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా ఆలయ విశిష్టతను తెలియచేస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పై కొందరు దాడి చేశారని తెలిసిందే. సోషల్ మీడియాలో రంగరాజన్ గారి పై దాడి జరిగిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఐతే ఈ దాడిపై ఇప్పటికే చాలా మంది నేతలు వారి స్పందన తెలియచేయగా లేటెస్ట్ గా అర్చకులు రంగరాజన్ గారి పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. శ్రీరంగరాజన్ గారి పై దాడి తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడి ఒక వ్యక్తిపై చేసినట్టు కాకుండా ధర్మ పరిరక్షణ పై దాడిగా భావించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదని, కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలకు, పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులం అని చెప్పి ఒక గ్యాంగ్ శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏంటో పోలీసులు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి.. తెలంగాణా ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు పవన్ కళ్యాణ్.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం విలువైన సూచనలు శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ కార్యక్రమం కూడా ఎలాంటి దశలో ప్రారంభించాల్సి వచ్చిందో కూడా తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై శ్రీ రంగరాజన్ గారు ఎంతో తపన పడుతున్నారని.. ఆయనపై చోటు చేసుకున్న ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలిపునిచ్చారు. చిలుకూరు వెళ్లి శ్రీ రంగరాజన్ గారిని పరామర్శించి ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని తెలంగాణా జనసేన పార్టీ విభాగానికి దిశానిర్దేశం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Pujari garini kotadam entra LKs💦
Please Respond anna ayana mana kosam chala Sarlu Stand theesukunaru @PawanKalyan pic.twitter.com/J8CPCXr3qJ
— JaLsa🥛 (@Janasena200) February 10, 2025