Switch to English

జనసేనాని ‘నవ్వు’ వెనుక ‘పొత్తు’ రాజకీయమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ పంచన జనసేన పార్టీ చేరబోతోందంటూ వైసీపీ నేతలు పేలిన అవాకులు చెవాకులు అన్నీ ఇన్నీ కావు. ‘భీమ్లానాయక్ కాదు బిచ్చం నాయక్..’ అంటూ ఓ మాజీ మంత్రి ప్రేలాపనల్ని చూశాం. ఇంతకీ, పొత్తుల విషయమై జనసేన అధినేత ఏం ఆలోచిస్తున్నట్టు.? వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదు.. అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి.?

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనంలోకి వెళ్ళారు.. పొత్తుల వ్యవహారానికి సంబంధించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు’ అని తాను చెప్పడానికి కారణం వైసీపీయేనని జనసేనాని వ్యాఖ్యానించడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

‘వైసీపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది.. మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.. హోంమంత్రి ఈ విషయమై చాలా తేలిగ్గా మాట్లడుతున్నారు.. ఇలాంటి ప్రభుత్వం ఇంకోసారి అధికారంలోకి రావాలని ఎవరైనా కోరుకుంటారా.?’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మీడియా ప్రశ్నలు సంధించినప్పుడు నవ్వుతూ కనిపించారు. ఆ నవ్వు వెనుక అర్థమేంటి.? పవన్ కళ్యాణ్ ధీమా ఏంటి.? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

‘ఏదో ఊరికే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని నేను అనలేదు.. దాని వెనుక చాలా అర్థం వుంది.. చూద్దాం, ఎవరెవరు కలిసి వస్తారో ఈ విషయంలో..’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. దానర్థం, జనసేన పార్టీతోనే ఎవరైనా కలవాలి తప్ప, జనసేన ఎవరితోనూ స్వచ్ఛందంగా కలవదనే సంకేతం పవన్ కళ్యాణ్ ఇచ్చేసినట్టే కదా.?

దీన్ని షరామామూలుగానే ‘ట్విస్ట్’ చేస్తూ వైసీపీ ‘మంద’ మొరగడం మామూలే. ఆ రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, జనసేన వ్యూహం అర్థం కాక వైసీపీ అధిష్టానానికి మైండ్ బ్లాంక్ అయిపోతోందిప్పుడు. ‘151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్నారేమో.. వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు కూడా రావు’ అని పవన్ కళ్యాణ్ తేల్చేయడంతో వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...