ఇతర పార్టీలతో పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ కార్య నిర్వాహక సభ్యులతో పవన్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటివల చంద్రబాబు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్లపై స్పందించారు.
‘జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం. ఇతర పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చు. అయితే.. ఆయా పార్టీల మైండ్ గేమ్స్ లో జనసేన శ్రేణులు పావులు కావొద్దు. పొత్తులపై నేనొక్కడినే నిర్ణయం తీసుకోను. ప్రతి జనసైనికుడు, వీరమహిళల అభిప్రాయాలు, ఆలోచనల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాం’.
‘పార్టీ శ్రేణులంతా ఒకే మాట మీద ఉందాం. పార్టీ సంస్థాగత నిర్మాణంపై మనమందరం దృష్టి పెడదాం. ఈ ఏడాది మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించుకుందాం. ఇందుకోసం అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీ దిశానిర్దేశంతో సభ నిర్వహించి 2024 ఎన్నికలకు దిశానిర్దేశాన్ని సభలో చేసుకుందాం’ అని అన్నారు.
831195 41149Id need to speak to you here. Which is not some thing Which i do! I like reading an write-up that can make individuals believe. Also, thank you for permitting me to comment! 301467