Switch to English

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన సమాధానం రావడంలేదంటూ ఈ మధ్యనే వాపోయారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తెలుగునాట రాజకీయాల్లో మిగిలిన ఒకే ఒక్క పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పైకి కత్తులు దూస్తున్నా, తెరవెనుకాల టీడీపీ – వైసీపీ మధ్య 60-40 అవగాహన కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం.

లేకపోతే, గడచిన రెండున్నరేళ్ళలో టీడీపీ అధినేత చంద్రబాబుకి జైలు తప్పదంటూ వైసీపీ సర్కారు బీరాలు పలకడం మినహా, సాధించిందేంటి.? అంతకుముందు టీడీపీ హయాంలో.. ‘వైఎస్ జగన్ ఆస్తుల్ని జప్తు చేస్తాం.. అక్రమంగా దోచేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి చేరుస్తాం..’ అంటూ చంద్రబాబు సహా చాలామంది అప్పటి మంత్రులు సెలవిచ్చారు. కానీ, ఏం జరిగింది.?

సరే, టీడీపీ – వైసీపీ మధ్య ‘రాజకీయ అవగాహన’ని పక్కన పెడదాం. చంద్రబాబు, గత కొంతకాలంగా జనసేన మీదకు వలపు బాణాల్ని సంధిస్తున్నారు. ‘అటు వైపు నుంచి స్పందన రావడంలేదు.. మనమేం చేస్తాం.?’ అంటూ నిర్వేదం కూడా ప్రదర్శించారు ఇటీవల సొంత జిల్లా పర్యటన సందర్భంగా ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ. ప్రశ్న అడిగించింది ఆయనే, సమాధానం చెప్పిందీ ఆయనే.

ఇక, చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్న వైనంపై జనసేన అధినేత స్పందించాల్సి వచ్చింది. ‘ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పార్టీని బలోపేతం చేసుకుందాం. పొత్తుల నిర్ణయం నేనొక్కడినే తీసుకోను. అందర్నీ సంప్రదించాకే నిర్ణయం తీసుకుందాం. ప్రస్తుతానికైతే బీజేపీ – జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది..’ అని క్లారిటీ ఇచ్చేశారు జనసేనాని.

నిజానికి, పవన్ స్పందించకపోతే.. తెలుగుదేశం పార్టీ మరింతగా జనసేన మీద పొత్తుల పేరుతో దుష్ప్రచారం చేసేసేదే. ఇప్పటికే, జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్ని టీడీపీ అనుకూల మీడియా ఖరారు చేసేస్తోంది నిస్సిగ్గుగా.

ఏదిఏమైనా, చంద్రబాబు వలపు బాణాల్ని జనసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లయ్యిందనే భావించాలి ప్రస్తుతానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌...

రాజకీయం

బింబిసార ముసుగులో బులుగు రాజకీయం… టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు.?

మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా...

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

ఎక్కువ చదివినవి

విజయసాయిరెడ్డికి సీబీఐ మీద అంత నమ్మకమెలా వచ్చిందబ్బా.?

రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏంటో..) విజయసాయిరెడ్డి, సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఇంట్రెస్టింగ్ ట్వీట్లు వేశారు....

రోడ్డు ప్రమాదంలో చిరంజీవి ఫ్యాన్స్ ఉత్తరాంధ్ర కన్వీనర్ మృతి

జీవితం రెప్పపాటులో తలకిందులు అవుతుంది అనడానికి మరో ఉదాహరణ. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మృత్యు ఒడికి చేరుకోవడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల...

రాశి ఫలాలు: బుధవారం 03 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:44 సూర్యాస్తమయం: సా.6:34 తిథి: శ్రావణ శుద్ధ షష్ఠి రా.2:05 వరకు తదుపరి సప్తమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: హస్త సా.4:09 వరకు తదుపరి...

తెలుగు సీరియల్స్ నుండి కన్నడ నటీనటులను బ్యాన్ చేయనున్నారా?

ఒక సీరియల్ సెట్ లో హీరోకి, సహాయ దర్శకుడికి మధ్య జరిగిన చిన్న వాగ్వాదం ఇప్పుడు కన్నడ నటీనటుల బ్యాన్ వరకూ వెళుతోంది. వివరాల్లోకి వెళితే కన్నడ నుండి వచ్చిన చందన్ కుమార్.....

రాశి ఫలాలు: శుక్రవారం 05 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:44 సూర్యాస్తమయం: సా.6:34 తిథి: శ్రావణ శుద్ధ అష్టమి రా.11:33 వరకు తదుపరి నవమి సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం) నక్షత్రము: స్వాతి మ.3:30 వరకు తదుపరి...