Pawan Kalyan: తమిళ సినిమాల్లో తనకు ఇష్టమైన దర్శకులు, నటుల గురించి తమిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. తనకు మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమని అన్నారు. ఆయన సినిమా తీసే విధానం, టేకింగ్ అద్భుతమని కొనియాడారు. ప్రస్తుత జనరేషన్లో లోకేశ్ కనగరాజ్ పనితీరు నచ్చిందని అన్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలు నచ్చాయని అన్నారు. ఎస్.జె.సూర్య, కరుణాకరణ్ కూడా ఇష్టం.
కమెడియన్ యోగిబాబు తనకు నచ్చిన నటుడని అన్నారు. ఇటివల ఓ సినిమాలో సర్పంచ్ గా నటించి ఎంతగానో నవ్వించారని అన్నారు. పవన్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ తో పవన్ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి లడ్డూ విషయంలో నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమణ చేయనున్నారు.