Switch to English

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ అదే చెబుతున్నారు పవన్‌ కళ్యాణ్‌. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా.

తాజాగా, 108, 104 సేవల కోసం కొత్త అంబులెన్స్‌లను పెద్దయెత్తున జగన్‌ సర్కార్‌ ప్రారంభించిన దరిమిలా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ రెడ్డిగారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్స్‌లని ప్రస్తుతం వున్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం..’ అని ట్విట్టర్‌ ద్వారా అభినందించారు పవన్‌ కళ్యాణ్‌. అంతే కాదు, ‘ఇది ప్రపంచానికి గడ్డు కాలం. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం.. క్షేమంగా వుందాం..’ అని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మెచ్చుకోవాలంటే చాలా హుందాతనం కావాలి. ఆ హుందాతనం జనసేనానిలో కావాల్సినంత వుందని చెప్పడానికి ఇది ఇంకో ఉదాహరణ మాత్రమే. నిజానికి, కొద్ది నెలల క్రితమే, పవన్‌ కళ్యాణ్‌.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా వుంటామని ప్రకటించారు. అయితే, పనిగట్టుకుని కొందరు వైసీపీ మద్దతుదారుల ముసుగులో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ని అర్థం పర్థం లేకుండా ట్రోల్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలూ, మంత్రులూ పవన్‌ విషయంలో అత్యుత్సాహం చూపుతున్న మాట వాస్తవం. ఇదిలా వుంటే, పవన్‌.. జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

అఫ్‌కోర్స్‌, చంద్రబాబు హయాంలో పవన్‌ అప్పటి ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో ప్రశంసించినప్పుడు వైసీపీ శ్రేణులు నానా యాగీ చేశాయనుకోండి.. అది వేరే విషయం. ఎవరెంతలా విమర్శించినా, ఎవరెంతలా అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా.. జనసేన పార్టీ ఓ సిద్ధాంతానికి కుట్టుబడి రాజకీయాలు చేస్తోందని ఇంకోసారి నిరూపితమయ్యింది. ఇటు అధికార పార్టీకి, అటు ప్రధాన ప్రతిపక్షానికీ ఈ ‘బాధ్యతాయుతమైన రాజకీయం’ ఎప్పుడు అలవడుతుందో ఏమో.! భ్రష్టుపట్టిపోయిన ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిందే. ఆ మార్పు జనసేనతోనే సాధ్యమని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. చెప్పడమే కాదు, ప్రజల కోసం నిస్వార్ధంగా రాజకీయం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారు. పవన్ కు రాజకీయ అనుభవం లేదు అనేవారు.. ఇప్పుడు ముక్కున వేలేసుకోక తప్పదేమో..

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...