గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,235FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు, పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా గ్రామాలకు భూసంరక్షణ కల్పించడంతో పాటు స్వయం సమృద్ధి సాధించేలా కొత్త ఆదాయ వనరులను సృష్టించవచ్చని ఆయన తెలిపారు.

మంగళవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.

పల్లె పండుగ తొలి విడతలో లక్ష్యంగా పెట్టుకున్న 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో 2,750 కిలోమీటర్ల లక్ష్యానికి మించి 3,580 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. గోకులాలు, ఫార్మ్ పాండ్స్, పశువుల నీటి తొట్టెల నిర్మాణంలో కూడా ప్రభుత్వం లక్ష్యాలను అధిగమించిందని వెల్లడించారు. ముఖ్యంగా రెండో విడతలో 81 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 86 వేల కుంటలు తవ్వించినట్లు చెప్పారు.

గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ వ్యవస్థను మరింత విస్తరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. డెల్టా ప్రాంతాలు, నల్లరేగడి నేలలు, మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా ఈ డ్రెయినేజ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులు శాస్త్రీయంగా, దీర్ఘకాలం మన్నేలా ఉండేందుకు ఇంజనీర్లు, ప్రజారోగ్య నిపుణుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణ రహదారుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆయన హెచ్చరించారు. సీసీ రోడ్లు వేసిన తర్వాత పక్కలా మట్టితో వాలు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రోడ్ల పనుల్లో పారదర్శకత కోసం జియో మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జియో ట్యాగింగ్, శాటిలైట్ సాంకేతికత ద్వారా ఏ గ్రామంలో ఎంత మేర పనులు జరిగాయో ఖచ్చితంగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా డూప్లికేట్ పనులకు చెక్ పడటంతో పాటు ప్రజలు కూడా రోడ్ల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే వినియోగించాలని, అనుమతించిన పనులను మాత్రమే చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఆడిట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

జులై 15 నుంచి ఇంటింటికీ కూటమి విజయాలు.. టీడీపీ కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, ఈ రోజు తాము పదవుల్లో ఉండటానికి పార్టీ కేడర్ చెమట, త్యాగాలే కారణమని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పేలా...

ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినా.. జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదా?

కాకినాడ జిల్లా తునికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...