బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ తో పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విమర్శకుల ప్రశంసలు పొందిన పింక్ సినిమా రీమేక్ ను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల గత రెండు వారాలుగా షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ మళ్లీ నేటి నుండి షూటింగ్ కు జాయిన్ అయ్యాడు.
నేడు ఉదయాన్నే పవన్ కళ్యాణ్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణలో పాల్గొన్నాడు. లాయర్ గా నల్లకోర్టు వేసుకుని కనిపించాడు. కోర్టులో వాదనల సీన్ ను షూట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచరం అందుతోంది. ఈ షెడ్యూల్ ను రెండు వారాల పాటు కొనసాగించబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంతకు ముందే తన షూటింగ్ పార్ట్‌ను ముగించుకోనున్నాడట.
మార్చిలో సినిమాను పూర్తి చేసి మే లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంకు గాను పవన్ భారీ పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా బడ్జెట్లో 75 శాతం పవన్ పారితోషికమే ఉందని అంటున్నారు. దిల్‌రాజు ఈ చిత్రంను చాలా నమ్మకంతో రీమేక్ చేస్తున్నాడు. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఉగాదికి టైటిల్‌ను మరియు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు సినిమా పవన్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారు.
946360 53138Hello! I just now would choose to supply a enormous thumbs up with the great data you can have here within this post. I will probably be coming back to your weblog website for additional soon. 319532
436435 799435Some actually wondrous function on behalf with the owner of this website, perfectly great topic material . 311147
544898 170831After study several with the content for your internet site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls have a appear at my site too and told me if you agree. 875490