ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే నెంబర్ 1629లో 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ అటవీ భూమిని ఆనుకుని సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద 184 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఈ భూముల్లో ఫామ్ హౌజ్ లు నిర్మించారు. భూమి చుట్టూ పెద్దపెద్ద గేట్లు వేసి కంచె నిర్మించారు. అయితే ఈ భూమిలో 42 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి కంచె వేసేశారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి.
అటవీశాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ పది రోజుల కిందట కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆదేశించారు. కానీ ఈ భూముల విషయం మీద ఇప్పటి దాకా స్పష్టత రావట్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నది అటవీ శాఖ భూములా లేదంటే రెవెన్యూ శాఖ భూములా అన్నది తేలట్లేదు. దాంతో పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 20లోపు కడప జిల్లాలో పవన్ కల్యాణ్ స్వయంగా పర్యటించబోతున్నారు. సజ్జల ఆక్రమించిన అటవీ భూములను దగ్గరుండి సర్వే చేయిస్తానని.. ఎంత భూమి కబ్జా అయిందో తేల్చేందుకు రెడీ అయ్యారు.
దాంతో జిల్లాలోని అధికారులు, వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చూస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు. ఆ దెబ్బకు చాలా మంది వైసీపీ నేతల గుండెల్లో పిడుగు పడ్డట్టు అయింది. ఇప్పుడు సజ్జల కబ్జాను టార్గెట్ చేస్తున్నారు. ప్రజల సొమ్మును ఎవరు దోచుకోవాలని చూసినా సరే వదిలేది లేదని.. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చునే వ్యక్తిని కాదని పవన్ ఇప్పటికే హింట్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏపీ రాజకీయం కడప జిల్లాకు మారబోతుందని తెలుస్తోంది. అసలే పవన్ కల్యాణ్ దూకుడుకు వైసీపీ నేతల్లో వణుకు పుడుతోంది.
అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే పవన్ వెనకడుగు వేయట్లేదు. నేరుగానే వాళ్ల బండారాన్ని బయట పెట్టేస్తున్నాడు. మరి వైసీపీ హయాంలో సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో ఏం చేస్తారా అన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంది. పవన్ దెబ్బకు సజ్జల పవర్ మొత్తం డ్యామేజ్ కావడం ఖాయం అంటున్నారు జనసైనికులు.