Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ (17) జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. నిరంజన్ కు పవన్ కల్యాణ్ అంటే అభిమానం. ఆయనకు పవన్ కల్యాణ్ ను కలుసుకోవాలనే కోరిక ఉంది. దీంతో విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లి తనను కలుసుకోవాలనే అతని చిరకాలవాంఛను తీర్చారు.
బాలుడి ఇంటికి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. పవన్ ను చూడటంతో నిరంజన్ కు చెప్పలేనంత ఆనందంతో పొంగిపోయాడు. బాలుడిని కలుసుకుని సంతోషాన్ని అందించారు. పవన్ కల్యాణ్. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు బాలుడి ఇంటికి దగ్గరికి చేరుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా భారీ పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
2014లో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ పవన్ కల్యాణ్ ను చూడాలనే కోరిక వెలిబుచ్చింది. అప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఆమె ఇంటికి వెళ్లి కలుసుకుని శ్రీజలో సంతోషాన్ని నింపారు. 2022లో కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన సత్తిబాబు క్యాన్సర్ తో పోరాడుతూ పవన్ కళ్యాణ్ ను కలుసుకోవాలని కోరాడు. అప్పుడూ పవన్ కల్యాణ్ ఆయన్ను కలుసుకుని సంతోషం పంచారు.
