Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం తీరికలేని రాజకీయ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. అయినా.. ఎన్నికల ముందే మొదలుపెట్టిన రెండు సినిమాలకు సమయం కేటాయించాల్సి ఉంది. అవి ఓజీ, హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు వెయిటింగ్. ఈక్రమంలో వారికి గుడ్ న్యూస్ చెప్పారు పవన్.
‘తీరికలేని పొలిటికల్ బిజీ షెడ్యూల్ మధ్య పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ కు కొన్ని గంటలు సమయం కేటాయించా’నంటూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. అమరావతి ప్రాంతంలో వేసిన సెట్లో హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొన్నారు. తన పాత్ర మేకోవర్ తో ఫోటో కూడా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తనదైన మ్యాచో లుక్స్ తో ఉన్న పవన్ చూసి అభిమానులు ముచ్చటపడుతున్నారు. కొంత భాగం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిగిలిన భాగం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మార్చి 28న సినిమా విడుదల కాబోతోంది. ఏ.ఎం.రత్నం నిర్మాత.