‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ మీడియా ముందుకొచ్చేస్తారనుకోండి.. అది వేరే సంగతి.
‘బస్తీ మే సవాల్’ అన్నాడో వైసీపీ నేత.! ‘పవన్ కళ్యాణ్ అంతు చూస్తాం..’ అన్నాడు ఇంకో వైసీపీ నాయకుడు. వాళ్ళందరికీ కళ్ళు బైర్లు కమ్మేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనం పైనుంచి అశేష ప్రజానీకాన్ని చూసి అభివాదం చేశారు.
తెలంగాణలోని కొండగట్టులో తొలుత ‘వారాహి’కి వాహన పూజ చేసిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడ దుర్గమ్మ సన్నిధిలోనూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వారాహి’ని చూసేందుకు జనసైనికులే కాదు, సాధారణ ప్రజానీకం కూడా పోటెత్తారు.
కాగా, దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనంటూ జనసేన అధినేత మీడియాతో చెప్పడం గమనార్హం. తిరుమల వెంకన్న సాక్షిగా రాజకీయ విమర్శలు చేసే వైసీపీ నాయకులకీ, దైవ దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడకూడదన్న నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్‌కీ పోలిక ఎలా పెట్టగలం.?
కామెడీ ఏంటంటే, ‘మలిటరీ గ్రీన్ రంగు కాకుండా, ఇంకో గ్రీన్ కలర్ వేసుకొచ్చారు.. అదీ మాకు భయపడే.. తెలంగాణలో ఒక రంగు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక రంగు..’ అంటూ వైసీపీ అర్థం పర్థం లేని విమర్శలు ‘వారాహి’పై చేయడం.
దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం, వారాహిపైకెక్కిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ కార్యకర్తలు అందించిన జనసేన జెండాని పట్టుకుని.. అశేష ప్రజానీకానికి ఆ జెండాని చూపించారు. మరోపక్క, కొందరు జనసేనానికి ‘గద’ని కూడా బహూకరించారు. ఆ గదతో జనసేనాని అచ్చం ‘ఆంజనేయస్వామిని’ తలపించాడనడం అతిశయోక్తి కాదేమో.!
Pawan kalyan events are all Publicity events not a Jenuine events