విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మూడు గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్లగలదు. కాలేజీకి వెళ్లేందుకు సౌకర్యంగా ఉండాలని సిద్ధూ దీన్ని స్వయంగా రూపొందించాడు.
ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సిద్ధూని తన మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు. సిద్ధూ తయారుచేసిన సైకిల్‌ను స్వయంగా నడిపారు. అతని ఆలోచనలకు మెచ్చుకుని రూ.1 లక్ష నగదు ప్రోత్సాహకంగా అందించారు. అలాగే, సిద్ధూ రూపొందించిన “గ్రాసరీ గురూ” వాట్సాప్ సేవను చూసి కూడా అభినందించారు.
సిద్దూ లాంటి యువతను ప్రోత్సహించడం అవసరమంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
