పవన్ కల్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్నారు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. డైరెక్టర్ మారడంతో షూటింగ్ వేగంగా కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో జాప్యం జరుగుతోంది.
మే 9కి రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. చివరకు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ విషయంపై తాజాగా పవన్ కల్యాణ్ డైరెక్టర్, నిర్మాతతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మే రెండో వారం లేదా మూడో వారంలోనే రిలీజ్ చేయాలని సూచించారంట.
పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వేగంగా పూర్తి చేసి సమ్మర్ లోనే తన సినిమాను రిలీజ్ చేయాలంటూ చెప్పారంట. డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వీఎఫ్ ఎక్స్, పోస్టు ప్రొడక్షన్ పనులే మిగిలి ఉన్నాయి. వాటిని త్వరగా ఫినిష్ చేసేసి.. రిలీజ్ కు రంగం సిద్ధం చేయబోతున్నారంట. అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా సోషియో ఫాంటసీగా రాబోతోంది. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్ లుక్ పై మంచి రెస్పాన్స్ ఉంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీమ్. ఇక నుంచి వరుస అప్డేట్లతో మూవీపై హైప్ పెంచబోతున్నట్టు సమాచారం.
