Switch to English

మహిళా అంధ క్రికెట్ ప్రపంచకప్ విజేతలను ఘనంగా సత్కరించిన పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో భారత మహిళల అంధుల క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది అందరితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి అసాధారణ విజయాన్ని అభినందించారు. ప్రపంచ కప్ గెలుచుకుని దేశానికి గౌరవం తీసుకువచ్చిన ఈ జట్టును చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఒక్కో మహిళా క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రికెటర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించడం విశేషం. అంధ క్రికెటర్ల సాధన దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అంధ క్రికెట్ ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పూర్తి సహకారం అందిస్తోందని, మహిళా క్రికెటర్లు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు.

ప్రపంచకప్ విజేత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక, పాంగి కరుణా కుమారి ఉండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీపిక తన గ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి పంచాయతీలోని తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలానే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రీడాకారిణి కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు లభించిన ఈ గౌరవం క్రీడా రంగానికి, ముఖ్యంగా అంధ క్రీడాకారిణులకు మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త సినిమా

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల చేసింది. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’...

Daily Horoscope: కన్యకు ఉద్యోగ లాభం, మకరానికి ఆర్థిక స్థిరత్వం

జనవరి 16, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పనిలో ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వి సినిమాస్...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...

వరద నీళ్ల పేరుతో దొంగ డ్రామాలా?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజల వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని వైసీపీ, బీఆర్ఎస్ కలిసి బురద రాజకీయాలు చేస్తున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా వరద జలాల విషయంలో రెండు...