పవన్ కల్యాణ్ ఒక మాట ఇచ్చాడంటే కచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఒక రోజు ఆలస్యం కావచ్చేమో గానీ.. మాట తప్పేది మాత్రం లేదు. ఇప్పుడు మరో విషయంలో కూడా ఇలాగే చేశాడు పవన్. మైసూర వారి పల్లెకు ఆయన ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నాడు. ఈ ఊరి స్కూల్ కు ఎకరం ఆట స్థలాన్ని పవన్ కల్యాణ్ కొనిచ్చాడు. ఇందుకు సంబంధించిన భూమిని ఆ ఊరి గ్రామ పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఇక్కడే అందరికీ ఓ డౌట్ రావచ్చు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అదేమన్నా పెద్ద గొప్పనా అనుకోవచ్చు.
కానీ పవన్ కల్యాణ్ సాయం చేసింది ప్రభుత్వ నిధులతో కాదు.. తన సొంత నిధులతో. ఏకంగా రూ.60 లక్షలు ఖర్చు పెట్టి మరీ ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ను అంతా ప్రశంసిస్తున్నారు. మాటలు చెప్పడం కాదని.. తమ లీడర్ చేతల్లో చేసి చూపిస్తాడంటూ ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. ఇక పవన్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన తర్వాత ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ఆయన ఇటు సినిమాలపై కూడా దృష్టి సారిస్తారని అంటున్నారు. ఓజీ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇంకోవైపు హరిహర వీరమల్లుపై కూడా ఓ అప్ డేట్ వదిలారు. అటు ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకా టైమ్ ఉందని అంటున్నారు.