గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్స్ తో న్యూస్ లో దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన గాడ్సే గురించి చేసిన కామెంట్స్ దగ్గరి నుంచీ నేడు ఆయన గాంధీజీతో పాటు మిగిలిన స్వాతంత్య్ర యోధుల ఫోటోలు కూడా నోట్ల పై ఉండాలని ప్రశ్నించిన ట్వీట్ వరకూ ప్రతిదీ సెన్సేషన్ అవుతోంది. ఇక్కడి వరకూ ఓకే, కానీ ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కూడా పలు బాధ్యతలు నివహిస్తుంటారు. దాని వలన ఆయన చేసే ప్రతి కామెంట్ ని జనసేన పార్టీ చేస్తున్నట్టు కొందరు ఆపాదిస్తున్నారు.
ఇప్పటికే నాగబాబు ఇవి కేవలానా నా స్వాభిప్రాయాలు మాత్రమే అని, వాటితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ మళ్ళీ అవే వార్తలు వస్తుండడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దీ సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ‘ జనసేన పార్టీలో ఉన్న లక్షలాది మంది నాయకులు, జన సైనికులు, అభిమానులు వారి వారి సామాజిక మాధ్యమాల ద్వారా వారు పంచుకునే వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఆ అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరో సరి చెబుతున్నానని’ తెలిపారు. మరి ఇప్పటికైనా ఇలా లింకప్ చేసి రాసే వార్తలు ఆగుతాయేమో చూడాలి.
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2020
118725 658972I gotta bookmark this internet website it seems really helpful invaluable 214254
267212 593178Hello I located the Free Simple Shopping Icons Download | Design, Tech and Internet post extremely interesting therefore Ive included our track-back for it on my own webpage, continue the excellent job:) 837267