రోడ్ల పనుల నుంచి గ్రీన్ షాపుల వరకు పూర్తి పారదర్శకత ఉండాలి: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,288FansLike
57,764FollowersFollow

పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు నేరుగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు.

స్థానిక సంస్థలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి సమాచారం ఉండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా జరిగాయని ఆయన అభినందించారు. పంచాయతీలు తమ ఆదాయ వనరులను మరింత పెంచుకునేలా సమష్టి కృషి కొనసాగించాలని సూచించారు.

ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పొడి వ్యర్థాలను ఇచ్చి, అవసరమైన వస్తువులు తీసుకెళ్తున్న తీరు ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఈ విధానాన్ని ప్రతి నియోజకవర్గంలో విస్తరించడంతో పాటు, తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఏప్రిల్ నెలలో స్వచ్ఛ రథాల ద్వారా 18.86 లక్షల కేజీల వ్యర్థాలను సేకరించామని, వాటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. గ్రీన్ షాపుల్లో పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లే విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, తద్వారా పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించాలని సూచించారు.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దిష్ట గడువులో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రతి రోడ్డు పనికి ముందుగానే పూర్తి చేసే సమయాన్ని నిర్ణయించాలని, ప్రజల వినతుల ఆధారంగా చేపడుతున్న పనుల్లో పూర్తి జవాబుదారీతనం కనిపించాలన్నారు. రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉన్నతాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

సినిమా

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా:...

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

Jana Nayagan: ‘జననాయగన్’ వచ్చేస్తోంది..! విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?

Jana Nayagan: తమిళనాడు సీఎం విజయ్ నటించిన‌ చివరి సినిమా 'జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన సినిమాపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

రాజకీయం

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం.. ప్రజల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు

జనసేన పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్...

గుట్టుపల్లి రైతులకు గుడ్ న్యూస్.. 22ఏ జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి

బేతంచెర్ల మండలం గుట్టుపల్లి రైతులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 2,074 ఎకరాల పట్టా భూములను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

ఎక్కువ చదివినవి

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

116 ఏళ్ల భక్తురాలి కోరిక తీర్చిన టీటీడీ.. ప్రత్యేక దర్శనంతో సత్కారం

భక్తి, సంకల్పం ముందు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం...

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’ పాట.. సంతోషంలో కరణ్ జోహార్

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ ప్రియులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. సినిమాలో...