పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత.. తాను నాన్ లోకల్ అనే ముద్రను పోగొట్టుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నియోజకవర్గం విషయంలో కొన్ని విమర్శలు వచ్చేవి. సొంత నియోజకవర్గంలో ఇళ్లు లేదని.. బయటి వారంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడు పవన్ తనను విమర్శించేందుకు ఆ అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారంట. అందులో భాగంగానే ఇప్పుడు పిఠాపురంలో స్థలాలు కొనేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాలు కొన్నాడు.
గత ఎన్నికల సమయంలో తాను పిఠాపురంలో స్థలాలు కొంటానని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానంటూ ఆయన వివరించారు. అందులో భాగంగానే ఇప్పుడు పిఠాపురంలో 12 ఎకరాలు కొన్నారని తెలుస్తోంది. మండలంలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.5 ఎకరాలు కొనుగోలు చేశారు పవన్. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పూర్తి చేశారు. ఇక్కడ త్వరలోనే ఇల్లుకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతాయని అంటున్నారు. దాని కోసం దేశంలోనే ఫేమస్ ఆర్కిటెక్ట్ లను పిలవబోతున్నారంట.
ఈ విషయమే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక్కడ క్యాంపు ఆఫీస్ కూడా కడుతారని చెబుతున్నారు. మిగతా స్థలంలో పంటలు పండించే ఆలోచనలో పవన్ ఉన్నారంట. వాటిని పేద ప్రజల కోసం ఉపయోగపడేలా చేస్తారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.