ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆయన త్రివేణి సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజనోవా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పుణ్యస్నానం చేశారు.
కుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన.. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. గతవారం ఆయన దక్షిణాది రాష్ట్రాలలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే.
గత నెల 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఈనెల 26 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే కుంభమేళాలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో 53 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమం గా కుంభమేళా రికార్డు సృష్టించింది.
Andhra Pradesh Deputy CM Pawan Kalyan, along with his wife Anna Lezhneva, son Akiranandan, and director Trivikram Srinivas, took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers. 🙏✨ #PawanKalyan #KumbhMela #PrayagrajAccident pic.twitter.com/5NF6tmeeUS
— TeluguBulletin.com (@TeluguBulletin) February 18, 2025