పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కలయికలో ఒక సినిమా రూపొందుతోన్న విషయం తెల్సిందే. సముద్రఖని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గానే చిత్ర టీమ్ రెండు అప్డేట్స్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేసింది.
అందులో ఒకటి ఈ చిత్రం జులై 28, 2023న విడుదల కాబోతోంది, మరొకటి ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసేసాడు. కేవలం 28 రోజుల్లో పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందట.
సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సాంగ్ ను తర్వాత చిత్రీకరిస్తారు. ఇక ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తాడట.