Switch to English

పవన్ కళ్యాణ్ టైమింగ్.! వ్యూహ రచనలో ఆయనకు సాటెవ్వరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,853FansLike
57,764FollowersFollow

అదేంటీ, సగం నియోజకవర్గాల్లో అయినా పోటీ చేయాలి కదా.? 21 సీట్లకే పరిమితమవడమేంటి.? అని ఒకింత జనసైనికులు కూడా ఆశ్చర్యపోయినా, ‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని స్పష్టంగా చెప్పి, జనసైనికుల్ని కన్విన్స్ చేయగలిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

రిజల్ట్ తెలిసిందే.! పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలోనూ జనసేన విజయం సాధించింది. రెండు లోక్ సభ సీట్లనూ కైవసం చేసుకుంది జనసేన. ‘టీడీపీ – జనసేన – బీజేపీ’ కలిసి పోటీ చేస్తాయని ఎన్నికలకంటే చాలా ముందు పవన్ కళ్యాణ్ చెబితే, అదీ తొలుత ఎవరూ నమ్మలేదు. కానీ, పవన్ కళ్యాణ్ వ్యూహం ఇక్కడా పని చేసింది.

‘పవన్ కళ్యాణ్ అంటే తుపాను..’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. అదీ, పవన్ కళ్యాణ్ ప్రత్యేకత.!

ఇప్పుడిదంతా ఎందుకంటే, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీస్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత ప్రస్తావన కూడా వచ్చింది. అది కాస్తా, టీడీపీ శ్రేణులు ట్రిగ్గర్ అవడం చూశాం.

సాక్షాత్తూ హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనకు మరింత స్ఫూర్తినిచ్చేలా వున్నాయనీ, తనకు కొండంత ధైర్యాన్నిచ్చాయనీ చెబితే, టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. మామూలుగా అయితే, టీడీపీ – జనసేన మధ్య ఈ విషయం పెద్ద అగాధానికి కారణమయి వుండేదే. టీడీపీ ఎకోసిస్టమ్ అలా తలగడుతుంది మరి.!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటవీ శాఖ సహా పంచాయితీ రాజ్ తదితర శాఖల్ని కలిగి వున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూనే, ఇతర శాఖల గురించి కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో, వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్, హోం శాఖ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.

‘ముఖ్యమంత్రి మాత్రమే, అన్ని శాఖల గురించీ రివ్యూ చేసే అవకాశం వుంటుంది. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రికి అదనంగా ఎలాంటి అధికారాలూ లేవు. ఇతర శాఖల్లో వేలు పెట్టడానికి వీల్లేదు..’ అంటూ వైసీపీ అను‘కుల’ మీడియా గుస్సా అవుతోంది.

ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. రాష్ట్రపతి అంటే, రబ్బర్ స్టాంప్ అనీ.. పేపర్ వెయిట్ అనీ ఓ భావన వుండేది. ఆ భావనని చెరిపేశారు అబ్దుల్ కలాం.! ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన నరసింహన్ కూడా, గవర్నర్ పదవికి అదనపు గౌరవాన్ని తీసుకొచ్చారు.

అలానే, డిప్యూటీ సీఎం అనే పదవికి, పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్వచనం ఇస్తున్నారిప్పుడు. దేశ రాజకీయాల్లోనే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదవికి బోల్డంత గౌరవం వచ్చింది. అదంతా, పవన్ కళ్యాణ్ పుణ్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వైసీపీ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నా, అందులో ఎవరూ ఉప ముఖ్యమంత్రిగా సరైన బాధ్యతలు నిర్వహించింది లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ కొందరు ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారు.. వాళ్ళూ అంతే.!

ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, టీడీపీతో పొత్తులో వుండీ.. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా వ్యవహరించడం. టీడీపీకి సొంతంగా మెజార్టీ వున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ‘హద్దుల్లో’ వుంటోందంటేనే, పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.

‘మా మిత్రుడు పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా పని చేస్తున్నారు. ఆయన సూచన మేరకు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాం..’ అని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల విషయంలోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పవన్ కళ్యాణ్ మార్కు సుస్పష్టం.

మంత్రి నారాయణ, హోం మంత్రి అనిత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థించాంటేనే, కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటన్నది స్పష్టమవుతోంది. ‘పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్షించే చట్టాలు రావాలి’ అని సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటిది, ఆయన ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం వుంటుందా.? ‘మన ప్రభుత్వం.. మన రాష్ట్రం..’ అన్న భావన వున్నప్పుడు, ఆ శాఖ.. ఈ శాఖ.. అని గిరిగీసుకుంటే ఎలా.? తప్పు ఎక్కడ జరిగినా, సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. ఆ పనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నది.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

ఎక్కువ చదివినవి

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్ మీట్లో దిల్ రాజు

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు వివరాలు...

జనసైనికులకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా...