Pawan Kalyan: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’నేది ఓ మాట. దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు. వరుసగా 10ఏళ్లు ఫ్లాపులు చూసినా ఆయన క్రేజ్ తరగకపోగా.. సినిమా సినిమాకూ పెరుగుతూ పోయింది. ఫ్లాప్ టాక్ వస్తే యావరేజ్.. యావరేజ్ వస్తే హిట్.. హిట్ అయితే సూపర్ హిట్.. అదీ దాటిపోతే బ్లాక్ బస్టర్స్. సినిమాల్లో అదీ పవన్ రేంజ్. ఇంతటి ఇమేజ్ ఉన్న పవన్ రాజకీయాల్లోకి వస్తే కూడా ఇదే జరిగింది. 10ఏళ్ల ఫ్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ చేసిన బీభత్సమే ఆయన రాజకీయ ప్రస్థానంలోనూ జరిగింది.
పదేళ్ల ప్రయాణం..
2014లో జనసేన పార్టీ స్థాపించారు పవన్. నాటి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి బయట నుంచి మద్దతిచ్చారు. పోటీ చేయలేదు కానీ.. పార్టీని నడిపించారు. 2019లో విడిగా పోటీ చేసి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగా.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలై అవమానలు పడ్డారు. పరాజయం ఆయన్ను ఆపలేదు. ఒక విషయాన్ని మనసులోకి తీసుకుంటే ఎంత బలంగా ఉంటారో నిరూపిస్తూ మించిన శక్తితో కదిలారు. మరో 5ఏళ్లపాటు పార్టీని, శ్రేణుల్ని నడిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజా క్షేత్రంలో నిలిచారు. సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు, ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలు నడిపిస్తూ కష్టమైన ప్రయాణంలో స్పష్టమైన అడుగులు వేశారు. ఈ ప్రయాణం ఆయనకు అవమానాలు.. సూటిపోటి మాటలు.. విమర్శలతో ముళ్లబాటే అయింది.
పవన్ వన్ మ్యాన్ షో..
బాధను భరిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఎడమొఖం.. పెడమొఖంగా ఉన్న బీజేపీ-టీడీపీని తనతో నడిచేలా కలిపారు. ఒక్కటిగా కదిలారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 2024 ఎన్నికలకు వెళ్లారు. ఫలితం.. తిరుగులేని విజయం. కూటమికే కాదు.. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2పార్లమెంట్ స్ఠానాల్లో 100శాతం స్ట్రైక్ రేట్ తో విజయం. భారతదేశంలోనే ఇదొక రికార్డు. 2024 ఏపీ ఎన్నికలు మొత్తం పవన్ చుట్టూనే తిరిగాయి. ఓటింగ్ రోజున ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటు వేశారంటే కూడా పవన్ మ్యానియానే కారణం. దీంతో పవన్ ను గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మీడియా, రాజకీయ నేతలు, ప్రజలు కీర్తిస్తున్నారు. ఈస్థాయి ఎన్నికలు గత కొన్నేళ్లలో చూడలేదన్నది అందరి మాట. దీంతో పవన్ ఖ్యాతి ఒక్కసారిగా పెరిగిపోయింది.
దేశ ప్రధానే ఎలివేషన్ ఇచ్చేలా..
‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పొడు’ అనే తన సినిమాలోని డైలాగ్ నే పటించి 2024 ఎన్నికలకు వెళ్లిన పవన్.. అవమానం పొందిన చోటే గెలిచి చూపించారు. ఏపీలో తప్పితే జాతీయంగా కొందరికే తెలిసిన పవన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ పొలిటీషియన్. పవన్-జనసేన పేరు మోగిపోతోంది. పవన్ పోరాటం, గెలుపుపై హిందీ పేపర్లు ఫ్రంట్ పేజీ ఆర్టికల్స్, నేషనల్ మీడియాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లలేడు అన్నవారే ఆశ్చర్యపోయేలా పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి ముఖ్య నేతలు, రాజకీయ ఉద్దండులు ఉన్నచోట.. ‘ఇతను పవన్ కాదు.. తుపాను’ అని సాక్షాత్తూ ప్రధాని మోదీ కొనియాడటంతో పవన్ పేరు హోరెత్తిపోయింది. 21సీట్లని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పవన్ విజయాన్ని, ఆలోచనను, నిశిత దృష్టిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
పాన్ ఇండియా రీచ్ ఇలా..
స్వతహాగా సినిమా స్టార్ అయిన పవన్.. తిరుగులేని స్టార్ డమ్ ఉన్నా ప్రస్తుత ట్రెండ్, అందరు హీరోలు ఉన్న పాన్ ఇండియా రేసులో లేరనేది ఆయన అభిమానుల బాధ, నిరాశ. తన గబ్బర్ సింగ్ సినిమాలో ‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా’, ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’ అనే డైలాగులు మోస్ట్ పాపులర్. వాటని రాజకీయాలకు కూడా ఆపాదిస్తారని మొన్నటి వరకూ ఎవరికీ తెలీదు. కానీ.. ఎవరి ఊహలకు అందకుండా వీటిని చేసి చూపించారు. రాజకీయాల్లో పాన్ ఇండియా రీచ్ సాధించారు. దర్శక, నిర్మాత, రచయిత, ఫ్యాన్స్, సినిమాలు కాదు.. ఏకంగా దేశ ప్రధాని తనను పొగిడేలా చేశారు. మరే సినీ పొలిటీషియన్ కు దక్కనిది సాధించి తన ప్రత్యేకత చూపెట్టారు. ప్రస్తుతం పార్టీలు, జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఫోకస్ మొత్తం పవన్ చుట్టూనే.
దేశమే పులకించేలా..
‘ఇది కదా పవన్ కల్యాణ్ అంటే.. ఇది కదా పాన్ ఇండియా రీచ్ అంటే’ అని జనసేన నేతల, కార్యకర్తలు, ఫ్యాన్స్ సంబరాలే చేసుకుంటున్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన తర్వాత భార్య, కుమారుడితో కలిసి తల్లి అంజనాదేవి, అన్నయ్య చిరంజీవి, కుటుంబం ఆశీస్సులు తీసుకున్న తీరు.. ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఆనందభాష్పాలు రాని అభిమాని లేడు. ప్రజలు కూడా వారి ఆప్యాయతలకు పులకించిపోయారు. నేషనల్ మీడియాలో సైతం.. ఇవీ మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు అని కీర్తిస్తున్నాయి. ప్రశాంతంగా సినిమాలు చేస్తూ.. విలాసవంతమైన జీవితం ఉన్నా ముళ్లబాటలాంటి రాజకీయాల్లో కోరి ప్రయాణించి అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు పవన్. కానీ.. చేసే పనిపైనే దృష్టి పెట్టి.. అనుకున్న లక్ష్యాన్ని చేధించారు. అదే నేటి ఆయన విజయం.. కీర్తి. అందుకే.. పవన్ కొట్టింది ‘కుంభస్థలాన్నే’.
You are so cool! I don’t think I have read anything like this before.
So wonderful to discover somebody with some
unique thoughts on this topic. Really.. thanks for starting this up.
This web site is something that’s needed on the web, someone with a bit of originality!