Switch to English

విశాఖలో జనసేనాని.! అరెస్టుల పర్వం వెనుక అసలు కోణమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,471FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ‘దమ్ముంటే విశాఖ వచ్చి చూడు..’ అని ఒక వైసీపీ నేత, ‘విశాఖ వస్తే తరిమి కొడ్తాం’ అని ఇంకో నాయకుడు.. ఇలా జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టేందుకు పవన్ కళ్యాణ్‌పై మాటలు తూలారు. వైసీపీ మంత్రులు కేవలం పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టేందుకే విశాఖ వెళ్ళారు తప్ప, విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన గర్జన కోసం కాదని నిన్నటి హంగామాతో తేలిపోయింది.

జనసైనికులు సంయమనం పాటించారు.. కానీ, కొందరు వైసీపీ కేటుగాళ్ళు జనసేన జెండాలు పట్టుకుని ‘పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు’ అలజడి సృష్టించారు. ఈ క్రమంలో మంత్రుల మీద దాడి జరిగిందంటూ వైసీపీ హంగామా షురూ చేసింది. విమానాశ్రయానికి వెళ్ళేందుకు ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారంటూ ఆ కోణంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మంత్రులపై హత్యాయత్నం.. అనే కోణంలోనూ కేసులు నమోదు చేశారట.

‘ఎవడ్నీ వదిలి పెట్టం..’ అంటూ జనసేనకు నేరుగానే కొందరు మంత్రులు వార్నింగ్ ఇవ్వడం, దానికి అనుగుణంగా పోలీసులు కేసులు నమోదు చేయడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది. అర్థరాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. పలువురు జనసేన నేతల్ని ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘పవన్ కళ్యాణ్‌ని కూడాఅ రెస్టు చేస్తారట.. విశాఖ వెళ్ళిపోదాం పదండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా జనసైనికులు సమాచారం పంపుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు వెళితే, విశాఖలో పరిస్థితి ఎలా వుండేదో అర్థం చేసుకోవచ్చు.

‘పోలీసులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.. పవన్ కళ్యాణ్ అరెస్టు జరుగుతుందనేలా హంగామా చేసి, అటువైపు ఎవరు వచ్చినా అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అటువైపుగా ప్రస్తుతానికి ఎవరూ వెళ్ళొద్దు..’ అంటూ అభిమానులే మళ్ళీ తమకు తాము సర్దిచెప్పుకోవడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు.

అయినాగానీ, ఇప్పటికీ విశాఖపట్నం నివురుగప్పిన నిప్పులానే వుంది. ఏ క్షణాన అయినా పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేయొచ్చరంటూ ప్రచారం జరుగుతున్న వేళ, జనసైనికులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ, పోలీసులు నమోదు చేసే కేసులు, ఈ క్రమంలో జరుగుతున్న అరెస్టుల వల్ల ఒరిగేదేంటి.?

కారు డ్రైవర్‌ని చంపేసిన ఎమ్మెల్సీ అధికార పార్టీ నాయకుడు గనుక అరెస్టు చేయడానికి హైడ్రామా నడిచింది. హిందూపురంలో వైసీపీ నేతని వైసీపీ నాయకులే చంపించేసిన ఘటనలో చట్టపరమైన చర్యలేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ, విశాఖలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో హంగామా చేశారని.. రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం ద్వారా సభ్య సమాజానికి పోలీసు శాఖ ఏం సంకేతాలు పంపుతోందో ఏమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...