విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఖుషి టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.
ఇది పవన్ కళ్యాణ్ నటించిన ఐకానిక్ చిత్ర టైటిల్ అన్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఇలా విజయ్ వాడేసుకుంటుండడం పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ట్విట్టర్ లో విజయ్ పై దాడికి దిగుతున్నారు.
మరోవైపు విజయ్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడికి దిగుతుండడంతో ట్విట్టర్ లో మరో ఫ్యాన్ వార్ మొదలైంది. వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ వాడుకున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు చాలా ఇబ్బంది వచ్చేస్తోంది అని ఒక ఫ్యాన్ అంటే, కావాలంటే ఖుషి రిలీజ్ అయ్యాక దాన్ని రీమేక్ చేసుకోవడానికి రైట్స్ ఉచితంగా పవన్ కు ఇస్తాంలే అని మరో ఫ్యాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
మరోవైపు పవన్ ఫ్యాన్స్ ఖుషి టైటిల్ తమకు ఒక ఎమోషన్ అని దీన్ని ఇలా వాడేసుకోవడం ఏం బాలేదని వాపోతున్నారు.