సీఆర్డీఏ మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ అర్థమవుతుంది: పట్టాభి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,674FansLike
57,764FollowersFollow

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అమరావతి, సీఆర్డీఏ పరిధి, మావిగన్ ప్రతిపాదన, అభివృద్ధి అంశాలపై మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం జగన్ నుంచి అభివృద్ధి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిని తెలిపే మ్యాప్ ఒక్కసారి చూసినా చంద్రబాబు విజన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.

పట్టాభి రామ్ మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం 2015లోనే స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 2015 సెప్టెంబర్ 22న జీవో నెంబర్ 207 ద్వారా సీఆర్డీఏను ఏర్పాటు చేసి, రాజధాని అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర వృద్ధికి పునాది వేసినట్టు వివరించారు. సీఆర్డీఏ అనేది కేవలం అమరావతి నగరానికి మాత్రమే పరిమితం కాదని, దాని పరిధిలో విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి నగరాలు, అనేక మున్సిపాలిటీలు, గ్రామీణ మండలాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి, ఘంటశాల, చల్లపల్లి నుంచి మొదలుకొని పామర్రు, గుడివాడ, నూజివీడు, మైలవరం, కొండపల్లి, జగ్గయ్యపేట వరకు, మరోవైపు గుంటూరు దాటి ఎడ్లపాడు, ఫిరంగిపురం వరకు విస్తరించిన భారీ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 8,350 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక సమగ్ర అభివృద్ధి కారిడార్‌గా అప్పుడే చంద్రబాబు రూపకల్పన చేశారని చెప్పారు. ఈ వాస్తవాలు తెలియకుండానే జగన్ “మావిగన్” అనే పేరుతో కొత్త చర్చ మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.

సీఆర్డీఏ అంటే కేవలం అమరావతి రాజధాని నిర్మాణమే కాదని, కోర్ రీజియన్, ఎక్స్టెండెడ్ రీజియన్, పెరిఫెరల్ ఎక్స్టెండెడ్ రీజియన్‌ల రూపంలో విస్తరించిన ప్రాంతీయ అభివృద్ధి మోడల్ అని పట్టాభి వివరించారు. ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరు వంటి ప్రాంతాలు కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగమని చెప్పారు. దీంతో అమరావతి అభివృద్ధి చెందితే దాని చుట్టూ ఉన్న అనేక పట్టణాలు, మండలాలు, గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఉపాధి, పెట్టుబడులు చేరుతాయని పేర్కొన్నారు.

అయితే, నేడు మావిగన్ ప్రతిపాదనపై ప్రేమ చూపిస్తున్న జగన్, 2020లో అదే పరిధిలో ఉన్న ఏపీ సీఆర్డీఏ యాక్ట్‌ను ఎందుకు రద్దు చేయాలని చూశారని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చి అమరావతిని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని, కానీ హైకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

పట్టాభి అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ ఎలా కీలకమైందో, అలాగే అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా మొత్తం సీఆర్డీఏ ప్రాంతం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల పెట్టుబడులు రావడం ద్వారా భారీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ రంగాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని అన్నారు. ఈ అన్ని చర్యలు చూస్తే రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ దృష్టి ఎంత స్పష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు.

అమరావతి అంశంలో “బిల్లు” మరియు “తీర్మానం” మధ్య తేడా కూడా వైసీపీ శ్రేణులు అర్థం చేసుకోవడం లేదని పట్టాభి విమర్శించారు. అసెంబ్లీలో చేసినది కేవలం ఒక తీర్మానం మాత్రమేనని, అది చట్టం కాదని వివరించారు. చట్టబద్ధత రావాలంటే కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి, లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడానికి అవసరమైన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ (అమెండ్‌మెంట్) బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిందని తెలిపారు.

ఇలాంటి ప్రాథమిక వ్యత్యాసం కూడా తెలియకుండా జగన్, ఆయన అనుచరులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టాభి అన్నారు. తీర్మానం అనేది అభిప్రాయం వ్యక్తీకరణ మాత్రమే, బిల్లు అనేది చట్టంగా మారే ప్రక్రియలో భాగమని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు.

మావిగన్ పేరును ప్రతిపాదించడం ద్వారా జగన్ ఇప్పుడు రాజకీయంగా కామెడీ పీస్‌గా మారిపోయారని పట్టాభి వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ శక్తులు అమరావతికి మద్దతు ఇస్తున్న సమయంలో జగన్ మాత్రమే వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో అమరావతి అంశం వచ్చినప్పుడు వైసీపీ వాకౌట్ చేయడం ద్వారా ఆ పార్టీ అసలు ఉద్దేశం బయటపడిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాయని పట్టాభి చెప్పారు. అమరావతి నిర్మాణం ఎంత వేగంగా సాగితే, జగన్ రాజకీయంగా అంత వెనుకబడతారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఇక ఫలించవని, అది ఇప్పుడు “అన్‌స్టాపబుల్” దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

ప్రతి నెల అమరావతి పనులపై సమీక్షలు నిర్వహిస్తూ, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని చెప్పారు. త్వరలోనే ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయని పట్టాభి రామ్ అన్నారు.

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

భారతీరెడ్డిని అవమానిస్తే కూడా జగన్ శభాష్ అంటారా?: లోకేష్ ఫైర్

"భారతీరెడ్డిని, తన ఇద్దరు కుమార్తెలను హోంమంత్రిని అవమానించిన విధంగా ఎవరైనా అవమానిస్తే కూడా జగన్ శభాష్ అంటారా?" అంటూ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. మహిళలను కించపరిచే వారిని ప్రోత్సహించడం, అలాంటి...

నిరంజన్ ధైర్యం నన్ను కదిలించింది: పవన్ కళ్యాణ్

అరుదైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ యువకుడు నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నిరంజన్ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను...

ఇది కదా మానవత్వం.. అభిమానిని హత్తుకున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలు, సినిమాలు, ప్రజాసేవలతో బిజీగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న అభిమానుల కోసం సమయం కేటాయించడం ఆయనకు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కర్కాటక రాశివారికి శుభవార్తలు.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాలు

జూన్ 16 , 2026 మంగళవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జూన్ 16, 2026 మంగళవారం నాటి రాశిఫలాలు ఇవి. గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌కు చెందిన...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’ చర్చ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. విద్యార్థుల ప్రోత్సాహం కోసం నిర్వహించిన ఈ...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

‘పెద్ది’కి భారీ వసూళ్లు.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లాభాలు నమోదు కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...