Switch to English

జనసేనపై విషం చిమ్ముతున్న ‘వసూల్‌ రాజా’లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరఫున ఓటర్లకు ఒక్క రూపాయి కూడా ప్రలోభాల కోసం ఖర్చు చేయని పార్టీ ఏదన్నా వుందంటే అది జనసేన మాత్రమే. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భారీయెత్తున డబ్బు కుమ్మరించాయి. ఒక్క ఓటు కోసం పది వేల రూపాయలు ఖర్చు చేసిన పార్టీలూ లేకపోలేదు. ఆ ఖర్చుని తిరిగి రాబట్టుకోవడానికి ‘వసూళ్ళకు తెగబడ్తున్న’ సందర్భాల్నీ చూస్తున్నాం. ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘అవినీతికి ఆస్కారం లేని పాలన’ అని చెబుతోంటే, ఇంకోపక్క అధికార పార్టీ నేతలే అడ్డగోలుగా వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్ళీ ఆ వసూల్‌ రాజాల మధ్య గొడవలు తలెత్తితే ముఖ్యమంత్రే స్వయంగా సెటిల్‌మెంట్లు చేయాల్సిన దుస్థితి.

మొన్న గుంటూరు జిల్లాలో, తాజాగా నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ‘ఇసుక కుంభకోణాల పంచాయితీ’ తలెత్తడం, అది కాస్తా అధికార పార్టీ పరువుని బజార్న పడేయడం తెలిసిన విషయాలే. ఇదిలా వుంటే, తాము బురదలో కూరుకుపోయి.. ఆ బురదని ఇతరుల మీదా చల్లే క్రమంలో వైసీపీతోపాటు, టీడీపీ.. జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తోంది. జనసేన పార్టీకి వున్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే. జనసైనికులేమో, తమ అధినేత కోసం స్వచ్ఛందంగా పార్టీకి విరాళాలిస్తూ.. పార్టీ నడిపేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు, ‘పవన్‌ కొత్త సినిమా విడుదలయ్యిందనుకుందాం..’ అంటూ చందాలు పోగేసిన విషయం విదితమే. కానీ, జనసేన మీద బురద చల్లేందుకోసం ‘వసూళ్ళకు పాల్పడుతున్నారు..’ అంటూ బురద జల్లే కార్యక్రమం షురూ చేశాయి వైసీపీ, టీడీపీ. తమ అనుకూల మీడియా సంస్థలతో ఈ ప్రచారానికి ఆ పార్టీలు తెరలేపడంతో, జనసేన అలర్ట్‌ అయ్యింది.

తమపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క, సోషల్‌ మీడియా వేదికగా జనసైనికులు, తమపై ఇతర పార్టీలు.. ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణల్ని ఇప్పటికే తిప్పి కొడుతున్నాయి. జనసేన పార్టీకి అసలు నేతలే లేరంటూ సదరు మీడియా సంస్థలే ఛలోక్తులు విసురుతున్న విషయం విదితమే. మరి, ఎవరు ఈ వసూళ్ళకు తెరలేపుతున్నారు.? అయినా, వైసీపీ – టీడీపీ వుండగా.. బెదిరించే ఛాన్స్‌ ఇంకో పార్టీకి దక్కుతుందా.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది జనసేన మీద ఈ ‘వసూల్‌ రాజాల’ ఆరోపణల పర్వం.

ఒక్కటి మాత్రం నిజం.. వసూళ్ళు చేపట్టాల్సిన ఖర్మ అయితే జనసేనకు పట్టలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఒక్క పిలుపునిస్తే.. పార్టీకి నిధులు వచ్చి పడతాయి. అక్కడిదాకా ఎందుకు.? ఓ సినిమా తన సొంత బ్యానర్‌లో పవన్‌ నిర్మిస్తానని ముందుకొస్తే, వందల కోట్లు వచ్చేస్తాయ్‌. అవి పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం పవన్‌ కళ్యాణ్‌కి లేదా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...