కాకినాడ నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుక సందర్భంగా జరిగిన ఊరేగింపులో కొందరు పాలస్తీనా జెండాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కాకినాడ భానుగుడి జంక్షన్, సమీప ఫ్లైఓవర్ వద్దనే చిత్రీకరించబడ్డాయని పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు, బాధ్యులుగా తేలిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దేశ భద్రత, సామాజిక శాంతి, సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మతపరమైన ర్యాలీల్లో విదేశీ జెండాలను ప్రదర్శించడం అంగీకారయోగ్యం కాదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.
