Switch to English

ఇంటర్వ్యూ: నిజాయితీగా చెప్పిన కథ “పలాస 1978”- దర్శకుడు కరుణ కుమార్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరుణ కుమార్ తో ఇంటర్వ్యూ…

ఆ అవార్డ్ నాలో నమ్మకం పెంచింది.!

కథలు రాయడం అలవాటు అయ్యాక…స్వచ్ఛ భారత్ కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు గా మారింది. ఆ సందర్భంగా కేటీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు సన్మానించారు.. అప్పుడు కేటీఆర్ గారి ప్రోత్సహం తో చాలా గవర్నమెంట్ యాడ్స్ చేసాను..తర్వాత కొన్ని కథలు రాసు కున్నాను..కానీ ‘పలాస ‘ మొదటి సినిమా అవుతుంది అనుకోలేదు.

వాస్తవ సంఘటనల నేపథ్యంలో..

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా “పలాస 1978”. తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఉన్న అనుబంధంతో మొదట ఈ కథను ఆయనకు క్లుప్తంగా వివరించాను. కథ నచ్చి వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఆయనే ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని పరిచయం చేసారు. ఆయనకు కథ నచ్చడంతో వర్క్ షాప్ లు నిర్వహించి, ప్రోపర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో సినిమా ను ప్రారంభించాము.

పాత్రలు ప్రత్యేక ముద్రను వేసుకుంటాయి..

ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండేలా కాకుండా కంటెంట్ బేస్డ్‌గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్‌గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్‌గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పాత్రల పేర్లు, వేష బాషలు చాలా సహజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి. ఉత్తరాంధ్ర జానపదం నుండి తీసుకున్న పాటలకు విశేష స్పందన వస్తుంది. పలాస మూవీ లో కనిపించే విజువల్స్ ఇప్పటి వరకూ తెలుగు తెర మీద రాలేదు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు…ఇది ఒక సమూహం కథ’.

నిజాయితీగా చెప్పిన కథ ఇది..

ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరిని అలరించే విధంగా పలాస కథను తెరమీద ఆవిష్కరించడం జరిగింది. ఒక నిజాయితీ ఈ కథలో కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసిన అందరూ బాగుందని మెచ్చుకున్నారు. సురేష్ బాబు సుకుమార్ బన్నీ వాసు, నాగ శౌర్య సినిమా చూసిన తరువాత చెప్పిన మాటలు మర్చిపోలేను.

విడుదలకు ముందే సినిమా కు ఇండస్ట్రీలో మంచి స్పందన ఉంది. రక్షిత్, రఘు కుంచె , తిరువీర్, నక్షత్ర పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి.

పలాస కు ప్రసంశలు..

సెన్సార్‌ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్‌ సూచించడంతో రివైజ్‌ కమిటీకి వెళ్లాం. అక్కడ మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమాలో ‘పలాస 1978’ చిత్రం భిన్నమైనదని చెప్పగలను. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మాకు అండగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజగారికి, మా సినిమాను విడుదల చేస్తున్న సురేష్‌ ప్రొడక్షన్‌ సంస్థవారికి ధన్యవాదాలు అంటూ ‘ముగించారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. మార్చ్ 6 న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో...

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...