Switch to English

పక్కా కమర్షియల్ రివ్యూ: కమర్షియల్ ఎంటర్టైనర్

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

Movie పక్కా కమర్షియల్
Star Cast గోపీచంద్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్
Director మారుతీ దాసరి
Producer అల్లు అరవింద్, బన్నీ వాసు
Music జేక్స్ బిజోయ్
Run Time 2గం 32ని
Release 1 జూలై, 2022

ఎంతో కాలం నుండి హిట్ లేకుండా ఉన్న గోపీచంద్, విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో జట్టుకట్టాడు. మంచి బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది పక్కా కమర్షియల్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

వివేక్ (రావు రమేష్) నిందితుడిగా ఉన్న కేసులో జడ్జ్ అయిన సూర్య నారాయణ (సత్యరాజ్) ఇచ్చిన తప్పుడు జడ్జ్మెంట్ కారణంగా రిజైన్ చేస్తాడు. అయితే సూర్య నారాయణ కొడుకు లక్కీ (గోపీచంద్)కు నాన్న వైఖరి మీద విరక్తి వచ్చి పక్కా కమర్షియల్ గా తయారవుతాడు.

చూసి చూసి, కొడుకు వ్యవహారం పట్ల విసుగు చెంది, వివేక్ కేసులోనే లక్కీకి కౌంటర్ వాదనకు దిగుతాడు. మరి కొడుకుపై తండ్రి పైచేయి సాధించాడా? పక్కా కమర్షియల్ గా ఉన్న కొడుకుని మార్చగలిగాడా?

నటీనటులు:

గోపీచంద్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాడు. తన స్క్రీన్ ప్రెజన్స్ కచ్చితంగా సినిమాకు ప్లస్ అయింది. తన ఫ్రెష్ లుక్స్ కానీ స్టైలిష్ మేకోవర్ కానీ చిత్రానికి ఉపయోగపడ్డాయి. ఇక నటనాపరంగా గోపీచంద్ ఎలా పెర్ఫర్మ్ చేస్తాడో అందరికీ తెలుసు. తన స్థాయికి తగ్గట్లుగా చేసుకుంటూ వెళ్లిపోయాడు.

మరోసారి ప్రముఖ పాత్రలో సత్యరాజ్ మెప్పించాడు. తండ్రీ కొడుకుల మధ్య కోర్ట్ రూమ్ సన్నివేశాలు కచ్చితంగా మెప్పిస్తాయి. రాశి ఖన్నా హైపర్ యాక్టివ్ పాత్రలో నటించింది. గోపీచంద్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఆమె డైలాగ్ డెలివరీ కానీ లుక్స్ కానీ పెర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. రావు రమేష్ మరోసారి ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడు. కొత్త మేకోవర్ లో విలన్ గా రాణించాడనే చెప్పాలి. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అదరగొట్టింది. అజయ్ ఘోష్ ఫన్నీ రోల్ లో మెప్పించాడు.

ఇక మిగతా సపోర్టింగ్ రోల్స్ లో అందరూ తమ పరిధుల మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు.

సాంకేతిక నిపుణులు:

జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం స్థాయికి తగ్గట్లు లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఇంకా బాగుండొచ్చు అనిపిస్తుంది. కరమ్ చావ్లా అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటి. ఫ్రేమింగ్ కానీ లైటింగ్ కానీ సూపర్బ్. ఎడిటింగ్ కూడా ఓకే.

ఫన్ నిండిన కోర్ట్ రూమ్ డ్రామా చేయాలన్న మారుతి ఐడియా మంచిదే. మారుతి అంటేనే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ చిత్రం నుండి చాలా ఆశిస్తాం. కథ బాగానే ఉంది. ట్రీట్మెంట్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా మారుతి రాసిన కొన్ని సంభాషణలు ఇంప్రెస్ చేస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

పాజిటివ్ పాయింట్స్:

  • గోపీచంద్
  • కొన్ని ఫన్ అంశాలు

నెగటివ్ పాయింట్స్:

  • మ్యూజిక్
  • రొటీన్ ఫ్లాట్

చివరిగా:

పక్కా కమర్షియల్ ఒక రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామా. ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా ఉంటే చిత్రానికి బాగా ప్లస్ అయ్యేది. మారుతి ట్రీట్మెంట్ నచ్చేవారికి ఈ సినిమా పరంగా ఢోకా లేదు. పూర్తిగా ఎంటర్టైన్ అవుతారు. మిగతా వారికి కూడా ఓకే అనిపించే చిత్రం పక్కా కమర్షియల్. బి, సి సెంటర్లకు కచ్చితంగా నచ్చే చిత్రమిది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

రాజకీయం

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

ఎక్కువ చదివినవి

కేంద్ర మంత్రులకే నా ఉచితాలు.. సామాన్యులకు వద్దా..?: కేజ్రీవాల్

కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే లేని తప్పు.. సామాన్యులకు ఉచితంగా విద్య, వైద్యం ఇస్తే తప్పేంటని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో...

ఈ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది : రష్మిక

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...