మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో కొట్టిన సక్సెస్ దెబ్బతో బులుగు పచ్చ మీడియాకి కళ్ళు బైర్లు కమ్మేశాయ్. చిత్రంగా బులుగు మీడియా, పచ్చ మీడియా ఇప్పుడు ఏకమైపోయాయ్. మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడవడానికి ఏదన్నా కారణం దొరుక్కపోతుందా.? అని గోతి కాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయ్.
దొరికేసింది మొత్తానికి.. ఓ కుళ్ళిపోయిన బొయిక. దాంతో, పండగ చేసేసుకుంటున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఓ వాల్ పోస్టర్ సీన్ వుంటుంది. చిరంజీవి, రవితేజ ఫొటోని ముద్దాడే సీన్. ఆ సీన్ చిరంజీవి సూచించిందే. ఆ విషయాన్ని దర్శకుడు బాబీ స్వయంగా చెప్పాడు కూడా.
ఆ సీన్ గురించి తాజాగా సినిమా విజయోత్సవంలో చిరంజీవి మాట్లాడారు. ‘ఓ చిన్న హీరో పోస్టర్‌కి పెద్ద హీరో ముద్దు పెట్టడం అంటే ఒప్పుకోరేమో..’ అని బాబీ అడిగినట్లు చెప్పారు చిరంజీవి. అంతే, కట్ అండ్ పేస్ట్ కామెంట్లతో బులుగు పచ్చ మీడియా పండగ చేసుకుంటోంది.
చిరంజీవి పెద్ద హీరో, రవితేజ చిన్న హీరో.! ఇందులో వింతేముంది.? తప్పేముంది.? వయసులో ఇద్దరి మధ్యా ఎంత తేడా వుంది.? పైగా, చిరంజీవికి రవితేజ వీరాభిమాని. ‘నాకు పవన్ కళ్యాణ్ ఎంతో, రవితేజ కూడా అంతే.. చిన్నప్పుడు ఇద్దరూ ఒకేలా వుండేవారు..’ అని చిరంజీవి పదే పదే చెబుతుంటారు.
తన తమ్ముడి స్థానాన్ని రవితేజకు చిరంజీవి ఇచ్చాక, ‘అన్నయ్యగా, దేవుడిగా చిరంజీవిని రవితేజ భావిస్తున్నప్పుడు’ వివాదానికి ఆస్కారం ఇంకేముంటుంది.? రవితేజ అభిమానుల్ని చిరంజీవి మీదకు ఎగదోయడం ద్వారా బులుగు పచ్చ మీడియా ఏం శునకానందం పొందుతుందో ఏమోగానీ, ‘రవితేజ లేకపోతే ఈ సినిమా లేదు’ అని చిరంజీవి చెప్పాడు. దీనిద్వారా రవితేజకి చిరంజీవి అమితమైన గౌరవం ఇచ్చినట్లన్న విషయాన్ని విస్మరించలేం.
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుని నందమూరి బాలకృష్ణ ‘తొక్కినేని’ అంటే కిమ్మనని సోకాల్డ్ యెల్లో మీడియా, ఇప్పుడిలా మెగాస్టార్ చిరంజీవి మీద లేని వివాదానికి మొరుగుతోందంటే, దానర్థమేంటి.?
రవితేజ కంటే స్టార్‌డమ్ పరంగా చిరంజీవి చాలా చాలా ఎక్కువ. ఇందులో వివాదమేముంది.? బాబీ చెప్పిన విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారంతే. అది కూడా, రవితేజ వల్లనే సినిమాకి ఇంత రేంజ్ వచ్చిందని చెప్పడం చిరంజీవి హుందాతనానికి నిదర్శనం.
‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తెచ్చిన కడుపు మంటని ఇలా బులుగు అలాగే పచ్చ మీడియా చల్లార్చుకుంటోందన్నమాట. కానియ్.. కానియ్.!