రిపబ్లిక్ డే సందర్బంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ఇవ్వడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాదికి గాను పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాదిపతుల చీఫ్ సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మ విభూషన్ అవార్డు దక్కింది. మృతి చెందిన బిపిన్ రావత్ కు కేంద్రం ఈ గౌరవంను ఇచ్చింది.
సుదీర్ఘ కాలంగా భారత రక్షణ రంగంలో సేవలు అందించి.. విధి నిర్వహణలో మృతి చెందినందుకు గాను కేంద్ర ప్రభుత్వం బిపిన్ రావత్ కు ఈ అవార్డును ప్రథానం చేయడం జరిగింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నతరెండవ పురష్కారం ఇచ్చి గౌరవించడం తో ఆయన అభిమానులు మరియు మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలకు ఇది ఖచ్చితంగా దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.