సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి, కాలా అంటూ రెండు సంచలన చిత్రాలను తెరకెక్కించిన పా రంజిత్, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పా రంజిత్ గత కొంత కాలంగా కోర్టు కేసులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉండడంతో అయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
దర్శకుడు పా రంజిత్ ఆ మద్య తిరుప్పనాండాళ్ అనే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన రాజా రాజా చోళన్ జాతీయులను కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజా రాజా చోళన్ సంగం సభ్యులు .. దర్శకుడు పా రంజిత్ తమ జాతిపై పలు సంచలన వ్యాఖ్యలు చేసారంటూ పోలీస్ కేసుపెట్టారు.
దాంతో రంగంలోకి దిగిన కోర్టు అతన్ని కోర్టుకు హాజరు కావాలని తీర్పు ఇచ్చింది. అతన్ని ఈ నెల 21 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇంతవరకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు గడువు ముగియడంతో అయనను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పా రంజిత్ బెయిల్ కోసం అప్లై చేసిన లాభం లేకపోవడంతో ఇప్పుడు అయన అరెస్ట్ తప్పేలా లేదంటూ కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హిందీలో ఓ గిరిజన నాయకుడి కథను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు పా రంజిత్.