ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం జరిగిన ఓటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈనెల 24న ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటించి.. మార్చి 12న ఆస్కార్ వేడుక నిర్వహించనున్నారు. ఈసారి జరిగిన ఓటింగ్ 95ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఓ రికార్డ్ అని అకాడమీ సీఆర్ఓ బిల్ క్రామెర్ అన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా.. సుమారు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. దీంతో ఈసారి ఆస్కార్ ఓటింగ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భారత్ నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా పాల్గొన్నారు.
భారత్ నుంచి నామనేషన్స్ కోసం పోటీ పడిన 10 చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, విక్రాంత్ రోణ, రాకెట్రీ, కాంతార, గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీహై, ఇరవిన్ నిళల్.. ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ కేటగిరీలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట ఇప్పటికే చోటు దక్కించుకుంది.
267028 63400This really is such a terrific post, and was thinking significantly the same myself. Yet another wonderful update. 42338