ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.!
ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య ప్రారంభించింది భారతదేశం. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ తెరపైకొచ్చింది. నిజానికి, పహల్గామ్ మాత్రమే కాదు, అంతకు ముందు పుల్వామా ఘటన కూడా ఆపరేషన్ సిందూర్ ఇంత సీరియస్‌గా ప్రారంభమవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
‘ప్రతిసారీ చావు దెబ్బ తినడమేనా.? శతృవుని చావు దెబ్బ కొట్టలేమా.?’ అన్న ఆవేదన సగటు భారతీయుడిలో పెరిగిపోతూ వచ్చింది. దానికి సమాధనమయ్యింది ఆపరేషన్ సిందూర్.! తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న, టెర్రర్ క్యాంప్స్‌ని ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా ధ్వంసం చేయగలిగాం.
ఆ తీవ్రవాదానికి సాయమందిస్తున్న పాకిస్తాన్‌ని కూడా చావు దెబ్బ కొట్టాం ఆపరేషన్ సిందూర్‌తో. పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు, అక్కడ పాకిస్తాన్‌కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. ఇలా కీలక విభాగాల్ని ఆపరేషన్ సిందూర్ ధ్వంసం చేయగలిగింది.
పాకిస్తాన్ చాలామంది సైనికుల్ని కోల్పోయింది. లెక్కలేనంది తీవ్రవాదులూ అంతమయ్యారు. ఇది సరిపోతుందా.? సరిపోదు. పాకిస్తాన్‌ని ఆక్రమించుకోవాలి.. కనీసం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని అయినా, తిరిగి తెచ్చుకోవాలన్న డిమాండ్లు భారత పౌరుల నుంచి రావడం సహజమే. అలా కోరుకోవడం తప్పు కాదు కూడా.
కానీ, అభివృద్ధి చెందుతున్న దేశం మనది. యుద్ధం పేరుతో, భారత ప్రగతిని అడ్డుకోవాలని చూస్తోంది, తీవ్రవాదం అనే రొంపిలో మునిగి తేలుతున్న పాకిస్తాన్. కాల్పుల విరమణ కోసం, మోకాళ్ళ మీద నిల్చుని మరీ అడిగింది పాకిస్తాన్. ఈ క్రమంలో, భారత్ చిన్న విరామం ప్రకటించిందంతే.
అంతలోనే, పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ఇంకోసారి బయటపెట్టింది.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరలేపింది. దాంతో, ఆపరేషన్ సిందూర్.. మళ్ళీ షురూ అయ్యింది. ఏ క్షణాన పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. యుద్ధం కోసం దేశమంతా ఒక్కటైయ్యింది.. ఎప్పటికీ ఒక్కటిదానే వుంటుంది.
