మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సినిమాలో భాగం అవుతున్నారు.
ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అవగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కన్నప్ప నుంచి త్వరలో మహాదేవ శాస్త్రి పరిచయ గీతం రాబోతుంది. ఈ సాంగ్ ను మార్చి 19 మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇక రాబోతున్న మహాదేవ శాస్త్రి పరిచయ గీతంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్. సినిమా నుంచి ఇప్పటికే శివ శివ శంకర సాంగ్ రిలీజై శ్రోతలను ఆకట్టుకుంది. ఇక రెండో సాంగా రిలీజైన సగమై చెరిసగమై కూడా ఇంప్రెస్ చేసింది. థర్డ్ సాంగ్ అది కూడా మోహన్ బాబు సాంగ్ అనగానే దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.