పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,039FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి స్వయంగా ‘ఉద్యమి’ సభ్యత్వాన్ని స్వీకరించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటికే ఈ నెల 19న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన నమోదు ప్రక్రియను గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం అయిదు రాష్ట్రాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచే వేలాది మంది సాధకులు సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. తొలి రోజే లక్ష మంది ‘ఉద్యమి’ సభ్యత్వం స్వీకరించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా పలువురు ‘ఉద్యమి’ సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకులతో చర్చించి మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

అదేవిధంగా 25 నియోజకవర్గాల పార్లమెంట్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. గురువారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలి రోజు నమోదు పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీనివాస్ మిరియాల పాల్గొన్నారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి విడుదలైన సమాచారం ప్రకారం, ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత వేగవంతం చేసి, లక్షలాది మంది యువతను, మహిళలను, సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ ముందడుగు వేస్తోంది. తొలి రోజే లక్ష సభ్యత్వాల నమోదు పార్టీకి బలమైన ఆరంభంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

ఎక్కువ చదివినవి

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

‘పెద్ది’ రిలీజ్ ట్రాక్‌లోనే.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా రిలీజ్ విషయంలో తాజా సమాచారం మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉందని రామ్ చరణ్...

రఘురామ కేసులో జగన్‌కు నోటీసులా?.. ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్న ఈ కేసు విచారణ, ఇప్పుడు...

“‘రియాలిటీ’తో రాబోతున్న కిరణ్ అబ్బవరం… కొత్త కాన్సెప్ట్ సిగ్నల్?”

యువ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టైటిల్ వినగానే సినిమా కథపై...