తలకాయ్.. మామిడికాయ్.! ఏదైనా సరే ‘వైసీపీ’ తొక్కుకుంటూ పోవడమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్యన సత్తెనపల్లి వెళ్ళారు. అక్కడ ఓ పెద్దాయనని వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. కారు కింద పడ్డాడు ఆ పెద్దాయన. కారు చక్రం కింద ఆ పెద్దాయన తలకాయ నలిగిపోయింది.. నలిగిపోవడమంటే, రోడ్డుకి రాసుకుంటూ పోయింది.

రోడ్డుకీ కారు చక్రానికీ మధ్య రాసుకుంటూ పోయిన ఆ పెద్దాయన తలకాయ.. వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. రాష్ట్రాన్ని కుదిపేసింది ఈ ఘటన. ఆ పెద్దాయన దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ పెద్దాయన వైఎస్ జగన్ కారు కింద పడలేదని తొలుత ఓ పోలీస్ ఉన్నతాధికారి తొందరపాటు ప్రకటన చేసినా, ఆ తర్వాత తప్పుని సరిదిద్దుకున్నారు.

కేసు నమోదైంది, ఈ కేసులో కారు డ్రైవర్ అరెస్టయ్యాడు. ఇదే కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో నిందితుడిగా వున్నారు. ఓ పార్టీ అధినేత, పైగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే.. ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.?

బాధిత కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని, పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి, చేతులు దులిపేసుకున్నారు వైఎస్ జగన్. అదేంటీ, కేసు నమోదై.. విచారణ దశలో వున్నప్పుడు, నిందితుడిగా వున్న వైఎస్ జగన్ ఎలా బాధిత కుటుంబాన్ని తన వద్దకు రప్పించుకుంటారు? ఇదో మిస్టరీ.

తాజాగా, జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈసారి జగన్ పర్యటన సందర్భంగా మామిడికాయలు నలిగిపోయాయి, చక్రాల కింద. అయితే, ఆ చక్రాలు ట్రాక్టరువి. ముందే, ప్లాన్ చేసుకుని.. రెండు ట్రాక్టర్ల లోడ్ మామిడికాయల్ని తీసుకొచ్చి, రోడ్డు మీద పారేయించి, వాటిని ట్రాక్టర్లతో తొక్కించారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి, వైసీపీ బండారాన్ని బయటపెట్టారు. తలకాయతో పోల్చితే, మామిడికాయల వల్ల ప్రాణ నష్టమైతే లేదు. అక్కడికి సంతోషపడాల్సిందే. కానీ, ఇదేం తొక్కుడు పైత్యం.?

మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు.. సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ, వైసీపీ తొక్కుడు విధానాన్ని ఎండగట్టారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులే లక్ష్యం: నారా లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు....

‘టాక్సిక్’లో లేడీస్ పవర్.. కొత్త వీడియోతో పెరిగిన అంచనాలు

 రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ చిత్రం **'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'**పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. తాజాగా చిత్ర బృందం...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

అరకులో జల్ సించాయ్ పనుల పరిశీలన.. నాగబాబు ప్రశంసలు

అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో జల్ సించాయ్ జన భాగీదారి 2.0 కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను శాసనమండలి సభ్యులు K. Nagababu మంగళవారం పరిశీలించారు. Chompi గ్రామంలో జాతీయ గ్రామీణ...

దక్షిణ కొరియాకు లోకేష్.. పెట్టుబడులే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) ప్రభుత్వం అధికారిక ఆహ్వానం అందించింది. భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం,...