Switch to English

‘కరకట్ట బురద రాజకీయం’ మళ్ళీ మొదలైంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘చంద్రబాబు ఇంటిని ముంచేందుకే, ప్రకాశం బ్యారేజీ గేట్లను ముందుగా తెరవలేదు.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వల నిర్వహణనను అస్తవ్యస్తంగా మార్చారు.. చివరికి చంద్రబాబు ఇంటిని ముంచలేకపోయారు.. పైశాచిక ఆనందం పొందారు అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు..’ అంటూ గత ఏడాది కృష్ణా నది వరదల సమయంలో టీడీపీ చేసిన ఆరోపణల్ని ఎలా మర్చిపోగలం.?

వైసీపీ తక్కువేం తిన్లేదు.. చంద్రబాబు ఇల్లు మునిగిపోతోందంటూ బీభత్సమైన బురద రాజకీయం చేసేసింది. కరకట్ట ప్రాంతంలో వున్న చంద్రబాబు ఇంటిని (చంద్రబాబు అద్దెకు వుంటోన్న ఇల్లు) కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అది అక్రమ కట్టడం.. అంటూ నోటీసులు కూడా పంపారు అధికారులు. కానీ, ఏం జరిగింది.? ఏడాది కాలంలో.. అధికార వైసీపీ, ఆ ‘అక్రమాల్ని’ బయటపెట్టలేదు.. ఆ గెస్ట్‌ హౌస్‌ కూల్చివేత జరగలేదు. కానీ, ప్రజలకు ఉపయోగపడే అధికారిక నిర్మాణం.. ప్రజా వేదికను మాత్రం కూల్చి పారేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

ఇప్పుడు మళ్ళీ కృష్ణా నదికి వరదొచ్చింది. చంద్రబాబు నివాసం వుంటోన్న ఇల్లు సహా, కరకట్టను ఆనుకుని వున్న అనేక నిర్మాణాలకు మళ్ళీ నోటీసులు వెళ్ళాయి. ఈసారి ఇదివరకటిలా కూల్చేస్తామని మాత్రం కాదండోయ్‌.. వరద వచ్చే అవకాశం వుంది గనుక, ఖాళీ చేయాలని మాత్రమే. ఈ ఏడాదిలో రాజకీయం ఏం అంతగా మారిపోయిందని ఈ ‘వెసులుబాటు’, ‘అతి ప్రేమ’ ప్రభుత్వ పెద్దలు ప్రదర్శిస్తున్నట్లు.? ఇదిప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన విషయం.

చంద్రబాబు నివాసం అక్రమమైనదా.? సక్రమమైనదా.? అక్రమమైనదే అయితే, ప్రజా వేదికను కూల్చేసినట్లు, చంద్రబాబు ఇంటిని ఎందుకు కూల్చేయలేదు.? చంద్రబాబు మీద వైఎస్‌ జగన్‌కి అంతలా ‘అమితమైన ప్రేమ’ ఎందుకు పుట్టుకొచ్చినట్లు.? ఇది చంద్రబాబు మీద ప్రేమా.? లేదంటే, గెస్ట్‌ హౌస్‌ ఓనర్‌ లింగమనేని మీద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమా.? ఇవేవీ కాదు, అది అక్రమ కట్టడం కానే కాదని ప్రభుత్వం చెప్పదలచుకుంటే, గతంలో ఎందుకు దాన్ని అక్రమ కట్టడంగా తేల్చారు.? ఆ పేరు చెప్పి ప్రజా వేదికను ఎందుకు కూల్చారు.? ప్రజా ధనాన్ని ఎందుకు నాశనం చేశారు.? అన్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...