‘ఒక చిన్న విరామం’ మూవీ రివ్యూ

0
‘ఒక చిన్న విరామం’ మూవీ రివ్యూ
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

నటీనటులు: సంజయ్ వర్మ, గరీమా సింగ్, నవీన్ నేని, పునర్నవి భూపాలం తదితరులు
నిర్మాత – దర్శకత్వం: సందీప్ చేగురి
సినిమాటోగ్రఫీ: రోహిత్ బాచు
మ్యూజిక్: భరత్ మాచిరాజు
ఎడిటర్‌: అశ్వత్ శివకుమార్
రన్ టైమ్: 1 గంట 28 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు? కొన్నిసార్లు చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అవుతాయి. ఏ ఇమేజ్ లేని స్టార్స్ అయితే క్యారెక్టర్స్ కు జస్టిస్ జరుగుతుంది. ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన నవీన్ నేని, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ పునర్నవి భూపాలం జంటగా, సంజయ్ వర్మ, గరీమా సింగ్ మరో జంటగా నటించిన సినిమా ‘ఒక చిన్న విరామం’. వీళ్లను హీరో హీరోయిన్లుగా పెట్టి కొత్త దర్శకుడు సందీప్ చేగురి తీసిన ‘ఒక చిన్న విరామం’ ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ: దీపక్ (సంజయ్ వర్మ), సమీర (గరీమా సింగ్) భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన సమీరను ఇంట్లో వదిలేసి ఒక డీల్ పని మీద వెళతాడు. మధ్యలో కార్ ట్రబుల్ ఇస్తుంది. ఆగిపోతుంది. ఒక పార్టీ నుండి తిరిగొస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ బాల (నవీన్ నేని), హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేసే మాయ (పునర్నవి) గొడవ పడుతూ పడుతూ దీపక్ కార్ ఆగిన చోట ఆగుతారు. దీపక్ ను మాయ గుర్తు పడుతుంది. కానీ, మాయను దీపక్ గుర్తుపట్టడు. అయితే తను అర్జెంటుగా వెళ్లాలి కాబట్టి అదే రూటులో వెళుతున్న బాల, మాయను లిఫ్ట్ అడిగి వాళ్ల కార్ ఎక్కుతాడు. అసలు, దీపక్ ఎక్కడికి వెళుతున్నాడు? ప్రతి అరగంటకు అతడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నది ఎవరు? బాల-దీపక్ ఏం చేశారు? దీపక్ వెళ్లిన చోటుకు పోలీసులు ఎందుకు వచ్చారు? అనేది మిగతా కథ.

తెర మీద స్టార్స్..

ఎటువంటి సందేహం లేకుండా పునర్నవి భూపాలం చెప్పొచ్చు. తిప్పి కొడితే స్క్రీన్ మీద జస్ట్ నలుగురు కూడా కనిపించరు. ఆడియన్ కి అవేవీ తెలియకుండా యాక్టింగ్ తో చాలా సీన్స్ మేనేజ్ చేశారు. గయ్యాళీ గర్ల్ ఫ్రెండ్ గా పునర్నవి చింపేసింది. పెర్ఫార్మన్స్ చేసింది. నవీన్ నేని క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. కొన్ని సీన్స్ బాగా చేశాడు. సంజయ్ వర్మ, గరీమా సింగ్ జస్ట్ ఓకే. మిగతా నటీనటులు పెద్దగా చేసింది ఏం లేదు.

తెర వెనుక టాలెంట్..

టెక్నికల్ గా సినిమాటోగ్రాఫర్ రోహిత్ batchu ది బెస్ట్ అనిపించుకున్నాడు. టాప్ వ్యూలో రోడ్ మీద తీసిన కొన్ని షాట్స్ సూపర్బ్. కానీ, పదే పదే అటువంటి షాట్స్ తో డైరెక్టర్ విసిగించాడు. మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మాచిరాజు రీరికార్డింగ్ పర్వాలేదు. సాంగ్స్ రెండే ఉన్నాయి.

ఈ సినిమాకు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సందీప్ చేగురి. ప్రొడ్యూసర్ గా పర్వాలేదు. మిగతా టెక్నీషియన్స్ నుండి బెటర్ అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడు. రైటర్, డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. చిన్న లైన్ తీసుకుని, ట్విస్టులతో థ్రిల్లర్ గా తీయాలనుకుని బోల్తా కొట్టాడు. స్క్రీన్ ప్లే, ట్విస్టులు వరస్ట్. అవి వర్కవుట్ కాకపోవడంతో సినిమా డిజప్పాయింట్ చేస్తుంది.

విజిల్ మోమెంట్స్:

– రన్ టైమ్. గంటన్నరలో థియేటర్ నుండి బయటపడొచ్చు.
– సినిమాటోగ్రఫీ

బోరింగ్ మోమెంట్స్:

పై రెండూ తప్ప మిగతావన్నీ

విశ్లేషణ: హాలీవుడ్ సినిమాల్లో చిన్న లైన్ తీసుకుని ఆడియన్ ని చూపు తిప్పుకోనివ్వకుండా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తారు. సందీప్ చేగురి కూడా అలా చేయవచ్చని అనుకున్నట్టున్నాడు. అలా మేజిక్ చేయాలంటే మంచి సీన్స్ రాసుకోవాలనే లాజిక్ మర్చిపోయాడు. విజువల్ గా సినిమాటోగ్రాఫర్ చేత నాలుగు మంచి షాట్స్ తీయిస్తే పాస్ అయిపోవచ్చని అనుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ టైపులో సినిమా అంతా కాకపోయినా ఎట్ లీస్ట్ నాలుగైదు సీన్స్ లో డైరెక్టర్ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తే బావుండేది. అవీ లేవు. దాంతో ఎవ్రి వీక్ రిలీజ్ అయ్యే సినిమాల్లో ఒక సినిమాగా మిగిలింది. ఓవరాల్ గా బోరింగ్ సినిమాగా మిగిలింది.

ఇంటర్వల్ మోమెంట్: సెకండాఫ్ లో అయినా కథ ఉంటుందా? హీరో హీరోయిన్లు కారులో కూర్చోబెట్టినట్టు మమ్మల్ని థియేటర్లో కూర్చోబెట్టి ఇంటికి పంపేస్తావా!

ఎండ్ మోమెంట్: ఈమాత్రం కథకు సినిమా తీయడం ఎందుకు? షార్ట్ ఫిల్మ్ తెస్తే సరిపోయేది కదా!

చూడాలా? వద్దా?: లైట్ తీస్కోండి.

బాక్స్ ఆఫీస్ రేంజ్: విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ముందు ఈ సినిమాకు ఎవరైనా వస్తారో? లేదో? చూడాలి. థియేటర్లో సీట్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి ప్రయివసీ కోరుకునే ప్రేమజంటలు రావచ్చు. టాక్ బయటకు వెళితే ప్రేక్షకులు రావడం కష్టమే.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

No posts to display