విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు గారి ఆలోచనలో భాగంగా నారా భువనేశ్వరి గారి ఆచరణలో మొదలైంది ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో మొదలైన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ పేదవారి ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తుంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగునీరు ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మస్సులను గెలుచుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజలకు సాయం చేసేందుకు భరోసా ఇస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తితో మహిళలు సొంత కాళ్లపై నిలబడే శక్తిని కూడా ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్. 28 ఏళ్ల ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజలు సంతోషకరంగా ఉన్నారు.
ఐతే 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుందని.. ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. మీరు కూడా భాగస్వామ్యమై ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింత జయప్రదం చేయాలని నారా లోకేష్ అన్నారు.