NTR : టాలీవుడ్ లో ఎక్కువ శాతం హీరోలకు సొంత బ్యానర్ లు ఉన్నాయి. కొందరు తమ సన్నిహితులతో బ్యానర్ లను పెట్టించి అందులో సినిమాలు చేస్తున్నారు. వేరే నిర్మాతలతో సినిమాలు చేసినా కూడా సొంత బ్యానర్ లను నిర్మాణ భాగస్వామ్యులుగా చేయడం ద్వారా లాభాల్లో వాటాను సొంతం చేసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త బ్యానర్ రాబోతుంది. అది ఎన్టీఆర్ నుండి అంటూ సమాచారం అందుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను కలిగి ఉన్నాడు. ఆ బ్యానర్ ఎన్టీఆర్ కి హోం బ్యానర్ అన్నట్లుగా కొనసాగుతూ వస్తోంది. ఇక మీదట ఎన్టీఆర్ కి సొంత బ్యానర్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ కొత్త బ్యానర్ లో కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామ్యం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు ప్రారంభం అయ్యాయి. వీరి సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు కూడా ఆ బ్యానర్ లో రూపొందే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ విషయమై నందమూరి ఫ్యామిలీ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
Greetings! Very useful advice within this post! It is the little changes that
make the largest changes. Thanks a lot for sharing!
I do consider all of the ideas you’ve presented on your post.
They are really convincing and will definitely work.
Still, the posts are too quick for starters.
Could you please prolong them a bit from next time? Thanks for the post.